E-Paper
Advertisement

Yatra 2 Movie : ‘యాత్ర 2’పై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే..?

Yatra 2 Movie : ‘యాత్ర 2’పై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే..?
Advertisement
Yatra 2 Movie

Yatra 2 Movie : ఏ భాషలో అయినా బయోపిక్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పైగా బయోపిక్స్‌గా తెరకెక్కిన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్ అవుతాయని కూడా మేకర్స్ భావించడం మొదలుపెట్టారు. మనకు తెలిసిన ఫేమస్ వ్యక్తుల జీవితాల వెనుక ఉన్న కథ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా స్పెషల్‌గా ఆసక్తి చూపిస్తారు. తాజాగా అలాంటి ఒక క్రేజీ, కాంట్రవర్షియల్ బయోపిక్.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Advertisement

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా హిట్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి అభిమానులు అంతా దర్శకుడు మహి వీ రాఘవకు ఫ్యాన్స్‌ అయిపోయారు. దీంతో టాలీవుడ్‌లో దర్శకుడు మహిని వెతుక్కుంటూ ఆఫర్లు వచ్చాయి. ఇక యాత్ర సినిమా సమయంలోనే కచ్చితంగా దీనికి సీక్వెల్ ఉంటుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ సీక్వెల్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది.

యాత్ర సినిమా రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కగా.. యాత్ర 2 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ జగన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతుందని రూమర్స్ వచ్చాయి. దాదాపుగా అదే నిజమని అందరూ భావిస్తున్నారు కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌లో హీరోగా మలయాళ హీరో మమ్మూట్టీని ఎంపిక చేసుకున్నాడు మహి. ఇప్పుడు జగన్ పాత్రను పోషించడం కోసం తమిళ హీరో జీవాను ఎంపిక చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ దీనిపై ఒక క్లారిటీ లేదు.

Advertisement

తాజాగా యాత్ర 2 గురించి అప్డేట్‌ను అందించాడు మహి వి రాఘవ. ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. 2024 ఫిబ్రవరీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఏపీ జెనరల్ ఎలక్షన్స్ సమయంలోనే ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుందని అంచనా. యాత్ర 2 సినిమా పూర్తిగా జగన్ పాదయాత్రపై ఫోకస్ చేస్తుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తుండగా.. శివ మేక నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×