E-Paper
Advertisement

Tamilisai: ఉస్మానియాకు గవర్నర్.. హరీశ్‌రావు ఫైర్..

Tamilisai: ఉస్మానియాకు గవర్నర్.. హరీశ్‌రావు ఫైర్..
Advertisement
governor tamilisai osmania hospital

TamiliSai: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించారు. సచివాలయంలో ఉస్మానియా ఆస్పత్రిపై ఓవైపు మంత్రి హరీశ్‌రావు సమీక్ష కొనసాగుతుండగానే.. గవర్నర్‌ ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది.

ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలను, పాత భవనాన్ని పరిశీలించారు గవర్నర్. వార్డుల్లో తిరుగుతూ.. పేషెంట్స్‌తో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా హాస్పిటల్‌కు రాలేదన్నారు గవర్నర్ తమిళిసై. ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లు అవుతోందని.. కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఉస్మానియాకు రోజుకు 2వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తున్నారని.. రోజూ సుమారు 200 వరకు సర్జరీలు చేస్తున్నారని చెప్పారు. అంతమంది వస్తున్న ఉస్మానియాకు సరైన భవనం లేదని.. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయంటూ.. దుస్థితి వెళ్లగక్కారు.

Advertisement

మరోవైపు, గవర్నర్ తమిళిసై ఉస్మానియాను సందర్శించడంపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గవర్నర్ రాజకీయం చేయడం తగదన్నారు. కొత్త భవనాన్ని కట్టేందుకు సర్కారు సిద్ధంగా ఉందని.. అయితే, ఆ విషయం కోర్టులో ఉందని అన్నారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×