Am Ratnam: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే మంచి ప్రొడ్యూసర్ గా పేరును వ్యక్తి ఏఎం రత్నం. కేవలం నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన దర్శకుడుగా కూడా సినిమా చేశాడు. ప్రేక్షకులకు ఎప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అనుక్షణం ఆలోచించే నిర్మాతలలో ఏఎం రత్నం ఒకరు. కేవలం డబ్బులు కోసమే సినిమాలు చేయడం మాత్రం కాకుండా ఒక మంచి కథను చెప్పాలి అనే ఉద్దేశం అతనికి ఎప్పుడు ఉంటుంది. ఇదివరకే ఆయన నిర్మాతగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఒరిజినల్ కంటే కూడా రీమేక్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. కేవలం తెలుగులో పవన్ కళ్యాణ్ తో మాత్రమే కాకుండా తమిళ్లో విజయ్ తో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాను కూడా నిర్మించింది ఈ నిర్మాతే.
మనీ మైండ్ తో సినిమా చేయలేదు
ప్రస్తుతం ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావలసి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. ఒక సందర్భంలో ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. ముందు ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఈ సినిమాను ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ టేకప్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ విషయంలో మరింత కేర్ తీసుకొని మరో సీక్వెన్స్ యాడ్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడానికి కారణం, ఒక మంచి అవుట్ పుట్ ఇవ్వాలి అనే ఉద్దేశం మాత్రమే. అలానే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ నేను ఎప్పుడూ మనీ మైండ్ తో సినిమా చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు.
రీమేక్ చేసే అవకాశం ఉన్నా కూడా
పవన్ కళ్యాణ్ మార్కెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం కొన్ని సినిమాలకు మంచిగానే వస్తాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉపయోగించుకుని చాలామంది నిర్మాతలు ఒక రీమేక్ సినిమా రైట్స్ కొనేసి త్వర త్వరగా ఆయనతో పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ తరుణంలో రత్నం అలా కాకుండా ఒక స్ట్రైట్ ఫిలిమ్ తో పవన్ కళ్యాణ్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుంది. ఇద్దరికీ మంచి పేరు రావాలని పవన్ కళ్యాణ్ కెరియర్ కు ఈ సినిమా మంచి ప్లస్ అవ్వాలని ఈ సినిమా చేస్తున్నట్లు నిర్మాత రత్నం అనౌన్స్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా రత్నం పైన ప్రశంసల వర్షం కురుస్తుంది.
Also Read : Pawan Kalyan: ఆ సినిమా చేసి ఉంటే నేను పాలిటిక్స్ లోకి వచ్చేవాణ్ణి కాదు