Manchu Manoj : టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రీసెంట్గా భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత మంచు మనోజ్ నుంచి సినిమా రావడంతో ఆయన అభిమానులు కుల్ ఖుషి అవుతున్నారు.. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మే 30 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ బ్లాక్‌బస్టర్ భైరవం పేరుతో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీ రిలీజ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.. దాంతో పాటుగా కన్నప్ప హార్డ్ డిస్క్ చోరీ పై ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. మంచు మనోజ్ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..
‘భైరవం’ సక్సెస్ మీట్లో ‘కన్నప్ప’ ముచ్చట..
మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. రెండు రోజుల్లో భారీగా కలెక్షన్స్ ను వసూల్ చెయ్యడంతో ఈ మూవీ సక్సెస్ మీట్ ను టీమ్ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్‌పై ప్రశ్న ఎదురవడంతో మనోజ్ స్పందించారు. కన్నప్ప హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా ? అని ఓ విలేకరి అడగ్గా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు..కన్నప్ప హార్డ్ డిస్క్ పోయింది.. మీకు సంబంధం ఉంది అనే వస్తున్నాయి కదా అని మనోజ్ ను అడగ్గా.. నేను మీకే ఇచ్చాను కదా.. మర్చిపోయారా మీరు మొన్న కలిసినప్పుడు ఇచ్చాను కదా అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చారు. ఒక అనేది చాలా మందికష్టం.. అందుకే తాను కన్నప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విష్ణు అన్నకు ఆల్ ది బెస్ట్ అంటూ మనోజ్ అన్నారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న అంజలి బాయ్ ఫ్రెండ్.. అస్సలు ఊహించలేదే..!
రీరిలీజ్ ల పై మనోజ్ షాకింగ్ రియాక్షన్..
ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలలో ఎక్కువగా మహేష్ బాబు సినిమాలకే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఓ స్ట్రైట్ సినిమా ను రీ రిలీజ్ సినిమా దెబ్బ కొట్టింది. అది కూడా మహేష్ బాబు సినిమా కావటం విశేషం. ఆ స్ట్రైట్ సినిమా భైరవం.. ఆ రీ రిలీజ్ సినిమా ఖలేజా. మహేష్ నటించిన ఈ సినిమా భైరవం సినిమాపై గట్టి ప్రభావం చూపించింది. భైరవం మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో నిన్న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంచు మనోజ్ ఈ రీరిలీజ్ ల గురించి స్పందించారు. రీ రిలీజ్ సినిమాలు వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో పెట్టుకుంటే బాగుంటుందని మనోజ్ సూచించారు. అలా చేయడం వల్ల కొత్త సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. వీకెండ్స్‌లో విడుదల చేస్తే మన సినిమాను ఇంకో సినిమాతో చంపేసినట్లు ఉంటుందన్నారు. డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు బాగుండాలంటే సినిమాలు వీక్ డేస్ లో పెట్టుకుంటే బెటర్, ఈ విషయంపై సినీ పెద్దలు ఆలోచించాలంటూ మంచు మనోజ్ రిక్వెస్ట్ చేశాడు.. మొత్తానికైతే నిన్న జరిగిన ఈవెంట్లో మనోజ్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది.