BigTV English

Bharateeyudu 2 : భారతీయుడు -2 టీమ్ కు సీఎం రేవంత్ అభినందనలు.. X లో పోస్ట్

Bharateeyudu 2 : భారతీయుడు -2 టీమ్ కు సీఎం రేవంత్ అభినందనలు.. X లో పోస్ట్

Bharateeyudu 2 Actors Video on Drugs : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారతీయుడు 2 టీమ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన X లో ట్వీట్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా.. కమల్ హాసన్, శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని కలిసి చేసిన అవగాహన వీడియోను పోస్ట్ చేశారు. డ్రగ్స్ నిర్మూలనకై ఈ వీడియోను రూపొందించడం హర్షించదగిన విషయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


కాగా.. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే.. ఆ చిత్రయూనిట్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ వీడియో చేసి.. సినిమా ప్రదర్శనకు ముందు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. కల్కి సినిమా టికెట్ల ధరల పెంపు తర్వాత.. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే భారతీయుడు 2 చిత్ర టీమ్ డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ.. వీడియో చిత్రీకరించారు.

25 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. ఈ సినిమాలో కమల్ హాసన్, నటుడు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిషోర్, ఎస్ జె సూర్య, సముద్రఖని, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 12వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో.. భారీ అంచనాలున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. రెండోభాగంలో కూడా అవినీతిపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×