BigTV English

J&K Kathua terror attack| ‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం

జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని.. దాడి చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే అన్నారు. చనిపోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

J&K Kathua terror attack| ‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం

Kathua terror attack news(Telugu breaking news today): జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని.. దాడి చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే అన్నారు. చనిపోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. “కఠువాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు వీరులను కోల్పోయాం. ఆ అమరవీరుల కుటుంబాలకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి వారి పట్ల సానుభూతి ఉంది. చనిపోయిన వారి నిస్వార్థ సేవను, త్యాగాన్ని దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టం. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను ఓడించితీరుతాం.” అని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో ఆయన రాశారు.

Also Read: Mumbai Heavy Rains| ముంబైలో భారీ వర్షాలతో రెడ్ అలర్ట్.. రెండో రోజూ స్కూళ్లు, కాలేజీలు బంద్


కఠువాలోని మారుమూల మాచెడి ప్రాంతంలో ఒక ట్రక్కు పది మంది జవాన్లు పాట్రోలింగ్ చేస్తుండగా ఉగ్రవాదులు వారిపై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా.. మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన తరువాత ఉగ్రవాదులు అడవిలో పారిపోయారు. ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది ఆ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత జైషే మహ్మద్ (జేఎం) షాడో సంస్థ కాశ్మీర్ టైగర్స్ ఈ దాడికి బాధ్యత వహించింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు రెండుసార్లు దాడులు చేశారు. గత కొన్ని వారాలుగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడంతో స్థానికులు బయటికి రావడానికి భయపడుతున్నారు.

Also Read: Mihir Shah Hit-and-Run Case| కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!

మరోవైపు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సైనికుల మృతి పట్ల తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతామని చెప్పారు.

Also Read: Virat Kohli Pub| విరాట్ కోహ్లికి చెందిన పబ్ పై కేసు నమోదు.. బెంగళూరులో ఎఫ్ఐఆర్

Jammu & Kashmir, Kathua Terror Attack, Defence Minister, Rajnath Singh,

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×