BigTV English
Advertisement

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Comedian Sapthagiri.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లకి లైఫ్ టైం తక్కువ అని చెబుతారు. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే హీరోయిన్లకే కాదు కమెడియన్స్ కి కూడా లైఫ్ టైం తక్కువే అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో సీనియర్స్ కు అవకాశాలు రావడం లేదనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా తన కామెడీతో, అద్భుతమైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న సప్తగిరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.


అసిస్టెంట్ డైరెక్టర్ గా సప్తగిరి తొలి అడుగు..

బొమ్మరిల్లు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ అందులో చిన్న కామెడీ పాత్ర చేసిన సప్తగిరి, ఆ తర్వాత దేశముదురు సినిమాలో నటించారు. అల్లు అర్జున్ పరుగు సినిమాలో ఈయన కామెడీకు మంచి పేరు లభించింది. ఆ సినిమాతో ఈయన అదృష్టమే మారిపోయింది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయితే చాలు కమెడియన్ గా తెలుగు పరిశ్రమలో మంచి పాపులారిటీ అందుకునే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సక్సెస్ అయ్యే ప్రయత్నం చేశారు సప్తగిరి. అందుకు తగ్గట్టుగానే తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వదలకుండా చేస్తూ వచ్చాడు. సప్తగిరి కెరియర్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ప్రేమ కథా చిత్రం. మారుతీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సప్తగిరి కామెడీ ఒక రేంజ్ లో ఉంది. అందులో దెయ్యం తో సప్తగిరి అక్కా మల్లొచ్చావా అక్కా అంటూ సాగే సీన్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అంతేకాదు అందరికీ ఈయన పై మంచి ఇంప్రెషన్ కూడా ఏర్పడింది.


18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం..

ఆ తర్వాత రాజు గారి గది సినిమాతో మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత లీడ్ రోల్ కూడా చేయాలని ప్రోత్సాహం రావడంతో ఆ ప్రయత్నాలు కూడా చేశారు. అందులో భాగంగానే సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి, వజ్రకవచదర గోవిందా వంటి సినిమాలు చేసి హీరోగా మెప్పించాడు. ఈమధ్య బిగ్ బాస్ విన్నర్ సన్నీతో కలిసి అన్ స్టాపబుల్ సినిమా చేశాడు కానీ ఈ సినిమా విజయాన్ని అందించలేదు. ఇదిలా ఉండగా దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయనకు అవకాశాలు కరువయ్యాయి.

అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం..

Comedian Sapthagiri: Are you away from the industry or have you kept away from it..?
Comedian Sapthagiri: Are you away from the industry or have you kept away from it..?

ఒకవైపు యంగ్ కమెడియన్స్ తమ కామెడీ టైమింగ్ తో అదరగొడుతుండడంతో సప్తగిరిని కాస్త మేకర్స్ దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సప్తగిరికి అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమయ్యాడా? లేక కొత్త వారిని దృష్టిలో పెట్టుకొని సప్తగిరికి అవకాశాలు ఇవ్వడం లేదా? అనే విషయాలు తెలియదు కానీ మొత్తానికి అయితే సప్తగిరి ఇండస్ట్రీలో కనిపించడం లేదని వార్తలు స్పష్టం అవుతున్నాయి. అయితే సప్తగిరి మాత్రం తనకు ఏ చిత్రాలలోనైనా సరే అవకాశం వచ్చిన చేస్తానని తెలియజేస్తున్నారు.. మరి ఈయనకు ఒక మంచి కామెడీ ట్రాక్ సినిమా పడితే తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆయనను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×