E-Paper
Advertisement

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?
Advertisement

Johnny Master.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ (Johnny Master) పై తాజాగా ఒక యువతి లైంగిక ఆరోపణలు చేసింది. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడమే కాకుండా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిన్న ఉదయం జానీ మాస్టర్ ను అరెస్టు చేశారు. జానీ మాస్టర్ ను అరెస్టు చేయడంతో యావత్ సినీ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నిజానికి మలయాళ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ , కమిట్మెంట్ ఉందంటూ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక పెను దుమారం రేగుతున్న వేళ ఇండియన్ కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకున్న జానీ మాస్టర్ పేరు తెరపైకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఛాన్స్ ఇప్పిస్తానని అత్యాచారం..

Advertisement

హైదరాబాద్, చెన్నై, ముంబై అంటూ అవుట్డోర్ షూటింగ్ కి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధిత యువతి చెప్పుకొచ్చింది. సెట్స్ లో కూడా అసభ్యకరంగా తాకేవాడని , క్యారవాన్ లో కూడా ఎవరూ లేనిది చూసి తనపై లైంగిక దాడి చేశాడని, శారీరకంగా ,మానసికంగా హింసించాడని, ఆయనతోపాటు ఆయన భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలని హింసించింది అంటూ బాధిత యువతి కంప్లైంట్ చేసింది. దీంతో జానీ పై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ ను గోవాలో ఉన్నాడని తెలుసుకొని పట్టుకున్నారు.

ఢీ షో నుంచే ఇంత యవ్వారం నడిపాడా..

Johnny Master: Eliminated in Dhee 11.. Did Johnny Master lead such a story?
Johnny Master: Eliminated in Dhee 11.. Did Johnny Master lead such a story?
Advertisement

ఇదిలా ఉండగా బాధిత యువతి తెలిపిన వివరాలను బట్టి చూస్తే.. ఢీ షో లో ఉన్నప్పటి నుంచి తనపై కన్నేసాడని ఆమె తెలిపింది. ఎంతో ప్రీ ప్లాన్ గా తన టీం తో కలిసి కథ నడిపించినట్లు చెప్పుకొచ్చింది. ప్రముఖ ఛానల్లో ప్రసారమైన డాన్స్ రియాల్టీ షో ఢీ లో పలు సీజన్లలో బాధిత యువతి పార్టిసిపేట్ చేసిందట. అయితే ఢీ 11 కి జడ్జిగా వచ్చాడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అప్పుడే ఆమెపై మనసు పారేసుకున్నట్లు సమాచారం అయితే ఢీ 11 లో ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత తన టీం తో ఆమెతో టచ్ లో ఉండేలా చేసుకున్నాడట జానీ మాస్టర్. దాంతో ఆమెకు టీం తో పలుమార్లు ఫోన్ చేయించి అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా చేరాలంటూ కోరాడట. అంతటి స్టార్ కొరియోగ్రాఫర్ అడిగితే కాదనలేక 2019లో అతని టీంలో చేరిందట. ఇక అక్కడి నుండి తన కామ వాంఛను తీర్చుకోవడం మొదలుపెట్టాడని బాధిత యువతి చెప్పుకొచ్చింది.

లైంగిక వేదింపులు భరించలేకే కంప్లైంట్..

ఇక షూటింగ్ అని వెళ్ళిన ప్రతిసారి కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతూ ఇబ్బందికి గురి చేశాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు సినిమాలో ఆఫర్ ఇస్తానంటూ, నువ్వే నా హీరోయిన్ అంటూ ఆమెను మభ్యపెట్టాడట. ఇక ఇద్దరు కలిసి సినిమా కూడా మొదలుపెట్టారు అలాగే సంచారి అనే సాంగ్ లో కూడా నటించారు. దీనికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ప్రెసెంటర్ గా వ్యవహరించడం మరో విశేషం. ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి శారీరకంగా లొంగ తీసుకొని మానసికంగా హింసకు గురి చేసాడట. లైంగిక దోపిడీకి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పెళ్లి చేసుకునేందుకు కూడా ప్రయత్నించాడు. ఇక రోజు రోజుకు ఇతడి ఆగడాలు తట్టుకోలేక జానీ మాస్టర్ పై కేసు నమోదు చేయించింది బాధిత యువతి. మొత్తానికైతే ఆమెపై కన్నేసి భారీగానే కథ నడిపించాడుగా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×