BigTV English

Committee Kurrollu Movie: దూసుకుపోతున్న ‘కమిటీ కుర్రోళ్లు’..రెండ్రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

Committee Kurrollu Movie: దూసుకుపోతున్న ‘కమిటీ కుర్రోళ్లు’..రెండ్రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

Committee Kurrollu Movie Collections:మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలి మూవీ ‘కమిటీ కుర్రోళ్లు.’ ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో మొత్తం 11మంది కొత్త హీరోలు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో మంచి పల్లెటూరు వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా విడుదలైనప్పటి నుంచి మంచి టాక్‌తో ‘కమిటీ కుర్రోళ్లు’ దూసుకెళ్తున్నారు.


డిఫరెంట్ కంటెంట్‌తో చిత్రీకరించిన ఈ మూవీ.. యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను సైతం ఆకట్టుకుంటోంది. దీంతో బాక్సఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. విడుదలైన తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరగడంతో సినిమాకు ఆదరణ పెరుగుతోంది. ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.3.69 కోట్లను రాబట్టింది.

ఈ సినిమాను నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించాడు. అయితే కలెక్షన్లు రోజురోజుకు పెరగడంతో రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.


 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×