BigTV English

Telugu Movie : స్టోరీలో వేలు పెట్టి కెలికేస్తున్న హీరో… డైరెక్టర్ అన్ హ్యాపీ..?

Telugu Movie : స్టోరీలో వేలు పెట్టి కెలికేస్తున్న హీరో… డైరెక్టర్ అన్ హ్యాపీ..?

Telugu Movie : డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక సినిమా హిట్ అయినా… ప్లాప్ అయినా… ఆ డైరెక్టర్‌దే రెస్పాన్సిబిలిటీ. కానీ, కొంత మంది హీరోలు… యాక్టింగ్ మాత్రమే చేయరు…. మిగితా వాటిల్లో కూడా వేలు పెట్టి కెలికేస్తూ ఉంటారు. ముఖ్యంగా డైరెక్టర్ చేసే పనిలో వేలు పెట్టి… డైరెక్టర్ ను ఇరిటేట్ అయ్యేలా చేస్తారు. దీని వల్ల సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. దేవర రిలీజ్ టైంలో…. డైరెక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో…


“ఎవడి పని వాడు చేస్తే.. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనది మనం చెయ్యక.. పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి, ఆయన్ని ఇబ్బంది పెట్టి.. ఇలాంటివి చేస్తేనే సమస్య.” అంటూ ఓ డైలాగ్ చెప్తాడు.

అది ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలీదు కానీ, అది చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఓ యంగ్ హీరోకి కూడా అదే కనెక్ట్ అవుతుంది.


టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో ఉన్నాడు. ఈ యంగ్ హీరో ఈ మధ్య తన సినిమాలకు తానే సొంతంగా స్టోరీలు రాసుకుని వేరే డైరెక్టర్లతో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యంగ్ హీరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఓ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుదాం.

ఇండస్ట్రీకి కల్ట్ మూవీస్ అందించిన డైరెక్టర్‌తో ఈ యంగ్ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ వస్తుంది. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఈ సినిమా విషయంలో హ్యాపీగా లేడట. దీనికి కారణం… ఆ యంగ్ హీరో నే.

డైరెక్టర్ కొరటాల శివ… “మనకి ఇచ్చిన పనికి మనం జవాబుదారీ. ఆ పనిని పూర్తి చేయాలనే భయంతో, మనం దానిని పూర్తి చేస్తే.. ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. ఎవడి పని వాడు చేస్తే.. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనది మనం చెయ్యక.. పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి, ఆయన్ని ఇబ్బందిపెట్టి.. ఇలాంటి చేస్తేనే సమస్య.” అని చెప్పినట్టు… ఆ డైరెక్టర్ ఫీల్ అవుతున్నాడట.

ఆ యంగ్ హీరో యాక్టింగ్ మాత్రమే కాదు… తనకు అంతా తెలుసు. తన సినిమాలకు తానే స్టోరీలు రాసుకుంటానని, అలాంటి అనుభవం ఉంది అంటూ ఈ సినిమా స్టోరీలో వేలు పెడుతున్నాడట. కథలో మార్పులు చేయాలి అంటూ డైరెక్టర్ పైన ఫోర్స్ పెడుతున్నాడట. దీంతో ఏం చేయాలని స్థితిలో ఆ డైరెక్టర్ ఉండిపోతున్నాడట. అంతే కాదు… ఈ హీరో ఇలా చేస్తున్నాడు అని తన ఫ్రెండ్స్ దగ్గర చెబుతూ ఫీల్ అవుతున్నాడని సమాచారం.

సినిమా వీలైనంత స్పీడ్ గా కంప్లీట్ చేసి, ఆ హీరో నుంచి దూరంగా వెళ్లిపోవాలని చూస్తున్నాడట. కాగా, ఇటీవలే ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. దానికి కాస్త పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇక మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×