Warm Water : శరీరం సరిగ్గా పనిచేయడానికి నీరు చాలా ముఖ్యం. నీరు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా బలాన్ని కూడా ఇస్తుంది. కానీ ప్రశ్న ఏమిటంటే మీరు ఎలాంటి నీరు త్రాగాలి. బరువు తగ్గాలంటే.. మలబద్ధకం నయం కావాలంటే.. ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే.. ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే.. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు.
ఆయుర్వేదం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన తర్వాత వేడి నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీంతో మీరు అనేక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
1. జీవక్రియను మెరుగుపరుస్తుంది:
ఉదయాన్ని గోరు వెచ్చని నీటితో ప్రారంభించాలని చాలా మంది చెబుతుంటారు. నిజానికి.. వేడి నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా మీ బరువు వేగంగా తగ్గుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు గోరు వెచ్చటి నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
2. బరువు తగ్గడం:
త్వరగా బరువు తగ్గాలనుకుంటే.. ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు త్రాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. తినడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగితే.. త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా తక్కువ కేలరీలు ఉన్న ఫుడ్ తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
3. జీర్ణవ్యవస్థకు మంచిది:
ఈ రోజుల్లో చాలా మంది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. మందులు లేకుండా ఈ సమస్యల నుండి బయటపడాలనుకుంటే క్రమం తప్పకుండా వేడి నీటిని తాగండి. దీనివల్ల మలబద్ధకం , ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. నిజానికి, బరువు తగ్గడంలో మలబద్ధకం ఒక పెద్ద అడ్డంకి.
4. రక్త ప్రసరణను పెంచుతుంది:
గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతే కాకుండా దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం కూడా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కండరాలు విశ్రాంతి పొంది తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది.
5. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది:
వేసవిలో ఉదయం పూట గోరువెచ్చటి నీళ్లు తాగొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సమ్మర్ లో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మీ శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా అలసటను తొలగిస్తుంది.
6. శరీరం డీటాక్స్ అవుతుంది:
గోరువెచ్చటి నీరు శరీరానికి డీటాక్స్ వాటర్ లా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల.. చెమట రూపంలో శరీరం నుండి వ్యర్థ పదార్థాలు సులభంగా తొలగిపోతాయి. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
7. జుట్టుకు మేలు:
గోరు వెచ్చటి నీళ్లు తాగడం కూడా జుట్టుకు మంచిది. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు.. జుట్టును హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా జుట్టు పొడిబారడం సమస్య తొలగిపోతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది.
Also Read: ఇంట్లోనే ఇలా నేచురల్ హెయిర్ కలర్స్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు మాయం
8. చర్మం మెరుస్తుంది:
గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ నీరు చర్మంలోని రంధ్రాలను తెరవడంలో సహాయపడుతుంది. దీని కారణంగా చర్మం నుండి వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. ఇది చర్మంపై రక్త ప్రసరణను పెంచుతుంది. ముఖంపై మెరుపును తెస్తుంది. తగినంత హైడ్రేషన్ కారణంగా.. ముఖంపై ముడతలు, ఫైన్ లైన్ల సమస్య తగ్గుతుంది.