Supreme Court: అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అరుదైన ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్ వెలుపల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జూన్ 16న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష జరగనుంది.
మణిపూర్ అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మణిపూర్ వెలుపల పరీక్షా కేంద్రాలను మార్చాలని, రవాణా సౌకర్యం కల్పించాలంటూ 140 మంది అభ్యర్థులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మణిపూర్ లోని కొండ ప్రాంతాల జిల్లాల అభ్యర్థులు కోరిన ఇంఫాల్ పరీక్షా కేంద్రాన్ని మార్చడానికి అనుమతి ఇస్తామని మార్చి 29 ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అలాగే వారికి ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ఖర్చుల కోసం రోజుకు రూ.1500 అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలా ఉంటే మణిపూర్ వెలుపల పరీక్ష కేంద్రాలు ఎంచుకున్న వారితో పాటు మార్చుకున్న అభ్యర్థుల పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయపూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లు చేయాలంటూ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి వీలు కాదని తెలిపింది.
Also Read: నిందితుల జాబితాలో ఆప్.. కోర్టుకు తెలిపిన ఈడీ..!
ఈ నేపథ్యంలోనే హైకోర్టు సూచించిన రోజు వారీ భత్యాన్ని 1,500 నుంచి రూ. 3000 లకు పెంచింది. ఇందు కోసం అభ్యర్థులు వారి చిరునామా పరిధిలోని నోడల్ అధికారిని సంప్రదించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా సుప్రీం కోర్టు జారీ చేసింది.