BigTV English

Allu Arjun : పుష్ప కా బాప్… బన్నీ మళ్లీ అదేే తీరు… ఏం మార్చుకోలేదు

Allu Arjun : పుష్ప కా బాప్… బన్నీ మళ్లీ అదేే తీరు… ఏం మార్చుకోలేదు

Allu Arjun :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత నెల రోజులుగా ఒకటే అంశం హాట్ టాపిక్ గా మారింది. అదే ” పుష్ప 2 సంధ్యా థియేటర్ ఘటన”. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అండతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్(Allu Arjun), ఆ తరువాత ‘పుష్ప’ సినిమాతో తన స్టామినా నిరూపించి నేషనల్ అవార్డు అందుకున్నారు. అయితే ఎప్పుడైతే నేషనల్ అవార్డు అందుకున్నారో ఆ తర్వాతే.ఆయన తీరులో మార్పు వచ్చిందని పలువురు సినీ హీరోల అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయం స్పష్టంగా మొన్నటి వరకు ఎక్కడా కనిపించకపోయినా.. పుష్ప 2 సినిమా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తుంటే.. ఆయన మారిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పవచ్చు.


అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా..

సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి.. జనాల్లోకి వచ్చినప్పుడు ఎంతో బందోబస్తుతో బయటకు రావాల్సి ఉంటుంది. లేకపోతే అనుకోని పరిణామాలు జరిగి..అవి మెడకు చుట్టుకుంటాయి. సంధ్య థియేటర్లో పుష్ప2 బెనిఫిట్ షో వేసినప్పుడు పోలీసులు ర్యాలీ నిర్వహించడానికి అనుమతులు నిరాకరించినా.. ర్యాలీ చేశారు అల్లు అర్జున్. దాంతో తొక్కిసలాట జరిగి, ఏకంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకేమో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్టయ్యారు బన్నీ. ఇక కనీసం బయటకు వచ్చిన తర్వాత అయినా ఆయన తీరు మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీనికి తోడు పోలీసులకు విరుద్ధంగా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ కామెంట్లు చేశారు. అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా బన్నీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు కూడా వ్యక్తమయ్యాయి.ఇక ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. మొన్న నాంపల్లి హైకోర్టులో పూచీ కత్తు పత్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు తన హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చేసి చాలా వినమ్రత కనబరిచాడు. దీంతో అల్లు అర్జున్ లో మార్పు వచ్చిందని అందరూ అనుకున్నారు.


మళ్లీ అదే తీరు..

అయితే సడన్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో చూస్తూ ఉంటే అల్లు అర్జున్ లో మళ్లీ అదే పొగరు, ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే, నేడు అల్లు అర్జున్ తండ్రి , టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh) పుట్టినరోజు. ఈ సందర్భంగా.. అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు అల్లు అర్జున్.. ఆ పోస్టులో కుటుంబ సభ్యులంతా కలిసి అల్లు అరవింద్ చేత కేక్ కట్ చేయించారు. ఇదంతా బాగానే ఉంది. ఆ పక్క ఫోటో లో కేక్ పై పుష్పా క బాప్ అని రాయడమే కాకుండా పుష్ప 2 సిగ్నేచర్ స్టాంపు కూడా వేశారు. తాను పుష్ప అని, తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా పుష్ప కా బాప్ అంటూ కేక్ ఉన్న ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇది చూసిన చాలా మంది “చింత చచ్చినా పులుపు చావలేదని”.. ఇంత జరిగినా బన్నీ లో మార్పు రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరమంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బన్నీలో ఆటిట్యూడ్ బాగా పెరిగిపోయింది అనేది అందరి వాదన.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×