Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టులలో దారుణంగా విఫలమయ్యాడు. తన 16 ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించిన విరాట్.. ఇటీవల దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో భక్తి మార్గంలోకి వెళ్లిపోయాడు.
Also Read: R Ashwin: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు… అధికారిక భాష మాత్రమే
విరాట్ కోహ్లీకి భక్తి కొంచెం ఎక్కువ. కూతురు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్యతో కలిసి తరచూ గుళ్ళకు వెళ్తూ చాలా సార్లు కనిపించాడు. లండన్ లో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనే ఎక్కువగా కనిపించాడు. అయితే తాజాగా కుటుంబ సమేతంగా ఓ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శించాడు. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ , అలాగే పిల్లలు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ తో కలిసి ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక ప్రాంతమైన “బృందావన్ ధామ్” ని సందర్శించారు.
ఈ క్రమంలో శ్రీ ప్రేమానంద్ గోవింద్ శరణ్ జి మహారాజ్ స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేశారు విరాట్ కోహ్ల, అనుష్క దంపతులు. అనంతరం ఆయన కోహ్లీ ఫ్యామిలీతో ఆప్యాయంగా మాట్లాడారు. ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ప్రేమతో ఉండాలని కోహ్లీ కుటుంబాన్ని ప్రేమనంద్ గోవింద్ శరన్ జీ మహారాజ్ ఆశీర్వదించారు. దీంతో వీరు సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ తనను తాను మానసికంగా మెరుగుపరుచుకోవడానికి ఈ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లే ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కోహ్లీ తన కెరీర్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి కూడా సెంచరీ చేయలేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలలో 13 మ్యాచ్ లు ఆడిన విరాట్ 12 ఇన్నింగ్స్ లలో 529 పరుగులు చేశాడు.
ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అయితే ఈ ఏడాది జరగబోయే ఛాంపియర్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చి తన అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఐపీఎల్ 2025 సీజన్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ గురించి సంకేతాలు ఇచ్చాడు ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్.
Also Read: Varun Aaron Retirement: క్రికెట్‌కు భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ గుడ్‌బై !
ఈసారి ఆర్సీబీ తలరాత మారుతుందని అన్నాడు. నవ శకం ఆరంభం కాబోతోందని.. కోహ్లీకే మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా విరాట్ కోహ్లీ వైపే తాము మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని తెలియజేశాడు.
Virat Kohli and Anushka Sharma arrived to meet Premananda Maharaj.
Anushka Sharma said, “Nothing is above devotion.”
Virat came last time during his downfall and after the blessings made a historic comeback pic.twitter.com/Xm0M71z6Lz
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 10, 2025