Game Chanher : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer Movie). పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చేసిన ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ ఓ ఐఏఎస్ పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే ఇందులో చరణ్ పాత్రకు ఇన్స్ఫేషన్ తమిళనాడు కేడర్ కు చెందిన ఓ పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి. అప్పట్లో ప్రభుత్వాన్ని సైతం గడగడలాడించిన ఈ ఐఏఎస్… అసలు ఎవరు? ఆయన్నే చరణ్ ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో చూద్దాం.
శుక్రవారం థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్.. అనౌన్స్మెంట్ నుంచే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇదే కాగా ఐదేళ్ల తర్వాత రామ్‌చరణ్ సోలోగా నటించిన చిత్రం కూడా ఇదే. ఇక దిల్‌రాజు నిర్మాణంలో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు మోస్ట్ అవైటింగ్ మూవీగా నిలించింది. ఇన్నాళ్ల వెయిటింగ్ తర్వాత ఎట్టకేలకు థియోటర్స్ లో రిలీజైన గేమ్ ఛేంజర్.. కొన్ని చోట్ల హిట్ టాక్, మరికొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో కీలకం మారింది. ఇందులో మెగా హీరో మూడు లుక్స్ లో అదరగొట్టేశాడు. వాటిలో ఒకటి కాలేజ్ లో యంగ్ లుక్, రెండు IAS అధికారి, మూడు తండ్రి పాత్రలో అప్పన్నగా కనిపించారు. ఇందులో అప్పన్న పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఇక IAS అధికారిగా నటించి మెప్పించగా ఈ పాత్రకు రియల్ లైఫ్ IAS అధికారి TN శేషన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్.. ఆయనే TN శేషన్. ఇప్పటి తరానికి ఈ పేరు పెద్దగా పరిచయం లేనప్పటికీ 90వ దశకంలో దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. బడా రాజకీయ నాయకుల్నే గడగడలాడించిన.. ఈ ఐఏఎస్ అధికారి అప్పట్లో ఓ సంచలనంగా మారారు. భారత ఎన్నికల అధికారిగా తన హక్కులను నిర్వహిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలకు ఆద్యం పోశారు. కేవలం ఎన్నికల సంఘంలోనే కాకుండా అప్పగించిన ప్రతీ శాఖలోనూ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రజా, పర్యావరణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. దీంతో ఆయన చుట్టూ ఎన్నో కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి.
మద్రాస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన శేషన్.. కేంద్ర ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలలో సైతం విధులు నిర్వర్తించారు. 1989లో భారతదేశ 18వ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశారు. 1990 నుంచి 1996 వరకూ ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేశారు. ఈ సమయంలోనే ఎందరో రాజకీయ నాయకుల్ని గడగడలాడించారు. ఈ పాత్రనే గేమ్ ఛేంజర్ లో పోషించిన రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించినప్పటికీ పలు ఇంటర్వ్యూలలో తన పాత్రకు ఇన్స్పిరేషన్ గా ఓ ఐఏఎస్ అధికారని చరణ్ స్వయంగా వెల్లడించారు. షూటింగ్ సమయాల్లో ఆ అధికారి వీడియోలు చూడటంతో పాటు వర్క్ విషయంలోనూ ఆయన్నే ఫాలో అయ్యే వాడినని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో కనిపించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని సైతం చరణ్ వెల్లడించారు.
ALSO READ : ఈ రోజంటే ఏదో తెలియని భయం… అప్పుడు బాబాయ్… ఇప్పుడు అబ్బాయి