BigTV English

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. మరో కరోనా పాజిటివ్..

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. మరో కరోనా పాజిటివ్..

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు చెయ్యనక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఒక్కో మూవీతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. గత ఏడాది గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అది మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఎంతమందికి పాజిటివ్ వచ్చింది ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అని మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..


మహేష్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్..

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ అన్న సంగతి ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మహేశ్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అందరు మాస్క్ లు ధరించి సేఫ్ గా ఉండమని సూచించారు. దీంతో తోటి నటీనటులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. శిల్ప శిరోద్కర్ మహేష్ బాబు భార్య నమ్రతకు అక్క అవుతారు. జనాల్లో రోగనిరోధక శక్తి తగ్గడమే కరోనా కేసులు వేగంగా పెరగడానికి కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..


అయితే, ఇటీవల మహేష్ బాబు భార్య నమ్రత కూడా తన ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నమ్రత కు కూడా పాజిటివ్ వచ్చిందని సన్నిహిత వర్గాల్లో టాక్.. ప్రస్తుతం మహేష్ బాబు అయితే షూటింగ్లో బిజీగా ఉండడంవల్ల ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియదు. కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం గెట్ విల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read : ముమైత్ ఖాన్ తలలో నరాలు తెగిపోయాయా..? ఎప్పుడు జరిగిందంటే..?

మహేష్ బాబు సినిమాలు..

మహేష్ బాబు ప్రస్తుతం భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ని పూర్తిచేసుకుని వచ్చేయడాది థియేటర్లలోకి తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నారు. నిజానికి రాజమౌళి సినిమాలు థియేటర్లలోకి రావాలంటే మినిమం రెండు మూడేళ్లు పడతాయి. మరి ఈ సినిమాకు ఎన్నేళ్లు పడతాయో చూడాలి.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు లుక్కు కొత్తగా ఉంది. గుబురు గడ్డం పొడవాటి జుట్టుతో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.. మరి సినిమాలో ఎలా ఉంటాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×