BigTV English

Mumaith khan : ముమైత్ ఖాన్ తలలో నరాలు తెగిపోయాయా..? ఎప్పుడు జరిగిందంటే..?

Mumaith khan : ముమైత్ ఖాన్ తలలో నరాలు తెగిపోయాయా..? ఎప్పుడు జరిగిందంటే..?

Mumaith khan : సినీ నటి ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ లలో నటించి తన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాల్లోని కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఒకవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ముమైత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే కెరీర్ పీక్స్ లో వెళ్తున్నప్పుడే ఆమె అనుకోకుండా సినిమాలకు బ్రేక్ తీసుకుంది. అందుకు కారణం ఆమె అనారోగ్య సమస్యలు అని ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దాదాపు ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయిన ముమైత్ ఖాన్ ఈమధ్య బుల్లితెరపై మెరుస్తుంది. టీవీ చానల్స్ లలో జరుగుతున్న పలు ఈవెంట్లలో సందడి చేస్తుంది. ఇక ఇటీవల కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసిన ఈమె తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఎన్నో కీలక విషయాలని ఆమె షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందా..?

హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ముమైత్ ఖాన్ కుందన్న విషయం తెలిసిందే.. అయితే వరుసగా తెలుగు తమిళ్ చిత్రాల్లో నటిస్తున్నప్పుడే ఆమెకు ఓ అనారోగ్య సమస్య వచ్చింది. ఆ సమయంలో ఆమె కంప్లీట్ గా బెడ్ రెస్ట్ కి పరిమితమైంది. తనతో ఆమె చేతిలో ఉన్న ఆఫర్స్ ని ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. తలకు గాయం తగిలిన కారణం తలలో దాదాపు ఏడు నరాలు కట్ అయ్యాయని అనడంతోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాను. ఆ తర్వాత ఆఫర్స్ కూడా పొయ్యాయాని ఆమె క్లారిటీ ఇచ్చింది.. సినిమాలు లేకపోవడం తో ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. కానీ నేను నా పేరెంట్స్ కోసమే ఎన్నో చేశాను. అని తన తల్లి దండ్రుల గురించి గొప్పగా చెప్పింది.


బిజినెస్ ను మొదలు పెట్టిన ముమైత్.. 

ఇటీవల కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.. అత్యాధునిక సౌకర్యాలు, ప్రొఫెషనల్ టీచర్స్, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌, క్రియేటివిటీతో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది.. ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైయిన్డ్ స్పెషలిస్టుగా తయారుచేయడమే.. కొత్తగా చేస్తే మార్కెట్ లో డిమాండ్ ఉంటుందని ముమైత్ అంటుంది. ఇక పెళ్లి గురించి ప్రసావన వచ్చింది. జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read : డిప్యూటీ సీఎం సినిమా టికెట్ ధర అంతనా..? ఫ్యాన్స్ కు నిరాశే..

ఈమె సినిమాల విషయానికొస్తే.. అప్పట్లో ముమైత్ ఐటమ్ సాంగ్స్ ఎంత ఫెమస్ అయ్యాయో తెలిసిందే.. అంతేకాదు. సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించింది.. RDX లవ్’ అనే సినిమాలో నటించింది ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘మైసమ్మ ఐపీఎస్’ అనే మూవీ వచ్చింది.. అదే విధంగా ‘ఎవడైతే నాకేంటి’, ‘ఆపరేషన్ దుర్యోదన’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ మూవీలో తన రోల్‌లోనే కనిపించింది.. ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఫ్యూచర్లో ఏమైన సినిమాలు చేస్తుందేమో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×