E-Paper
Advertisement

OTT Movie : దిష్టి బొమ్మను గెలికితే ఇంత డేంజరా? గుండెను దడ దడ లాడించే హార్రర్ థ్రిల్లర్

OTT Movie : దిష్టి బొమ్మను గెలికితే ఇంత డేంజరా? గుండెను దడ దడ లాడించే హార్రర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పటినుంచో ప్రేక్షకుల్ని భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లలోనే ఈ సినిమాలను చూసేవాళ్ళు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటీటీలో ఇటువంటి సినిమాలు వస్తుండటంతో, ఇంట్లోనే చూడటానికి ఇష్టపడుతున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ థ్రిల్లర్ సినిమా హాలీవుడ్ నుంచి వచ్చింది. ఒక భయంకరమైన ఆకారం మనుషుల్ని తిని శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. 23 సంవత్సరాలకి ఒకసారి ఇలా చేస్తుంటుంది ఆ వింత ఆకారం. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

డారీ, త్రిష అనే ఇద్దరు అన్నా, చెల్లెళ్ళు  కాలేజీ నుండి కారులో ఇంటికి వెళ్తుంటారు. వారు ఒక నిర్మానుష్యంగా ఉండే ఒక రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వింతైన ట్రక్ వారిని భయపెట్టేలా వెంబడిస్తుంది. ఆ ట్రక్‌ను నడిపే వ్యక్తి ఒక భయంకరమైన ఆకారంలో ఉంటాడు. క్రీపర్ అనే ఈ భయాంకరమైన జీవి ప్రతి 23 సంవత్సరాలకు 23 రోజుల పాటు మానవులను వేటాడి, వారి శరీర భాగాలను తిని బలపడుతుంది. ఈ క్రమంలోనే అది మళ్ళీ తిరిగివచ్చింది. ఇప్పుడు వీళ్ళ వెంట పడుతుంది. దిష్టి బొమ్మలా ఉండే ఈ ఆకారం నుంచి త్రిష, డారీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వాళ్ళు జెజెల్ అనే ఒక మహిళ నుండి, క్రీపర్ గురించి కొంత సమాచారం తెలుసుకుంటారు.

క్రీపర్ ఎంతో శక్తివంతమైనదని, అది ఒక్కసారి ఎవరినైనా ఎంచుకుంటే వదలదని, వాసనను చూసి వెతుక్కుంటూ చంపుతుందని తెలుసుకుంటారు. ఈ స్టోరీ ఇలా ఉత్కంఠంగా సాగుతూ ఉండగా,  క్రీపర్ నుండి తప్పించుకోవడానికి త్రిష, డారీ తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ అది వారిని వెంబడిస్తూనే ఉంటుంది.  క్రీపర్, డారీని ఎంచుకుని అతన్ని తీసుకెళ్తుంది. ఇదంతా చూసి త్రిషను విషాదంలో మునిగిపోతుంది. చివరికి ఆ వింత జీవి త్రిషను కూడా తీసుకెళ్లిపోతుందా ? దాని గతం ఏమిటి ? ఎంతమందిని చంపుతుంది ? ఎందుకు 23 సంవత్సరాలకు ఒకసారి మనుషుల్ని చంపుతుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : సైకోగా మారి కత్తి పట్టిన కవి … 41 అవార్డులతో హోరెత్తిన సినిమా … ఏ ఓటీటీలో ఉందో తెలుసా

యూట్యూబ్ (Youtube) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జీపర్స్ క్రీపర్స్’ (Jeepers Creepers). ఈ సినిమాకి విక్టర్ సాల్వా దర్శకత్వం వహించారు. ఇందులో గినా ఫిలిప్స్, జస్టిన్ లాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ యునైటెడ్ ఆర్టిస్ట్స్, మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ ద్వారా 2001 ఆగష్టు 31 న థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. తరువాత సీక్వెల్స్ కూడా వచ్చాయి. యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×