Big Stories

Costumes Krishna: కృష్ణను తిట్టుకున్న ప్రేక్షకులు.. ఎందుకంటే?

Costumes Krishna: నటుడిగా, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన మరణాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజనగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ 1954లో చెన్నై వెళ్లారు. కృష్ణకు మొదటిసారి డైరెక్టర్ బీఎన్ రెడ్డి డిజైనర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి అగ్రనటులకు కాస్ట్యూమ్స్ అందించారు కృష్ణ.

- Advertisement -

ఓ సినిమా సమయంలో శ్రీదేవి కోసం నిర్మాత పువ్వులతో కూడిన డ్రెస్సును తెప్పించాడట. ఆ డ్రెస్సు శ్రీదేవికి ఏమాత్రం నచ్చలేదట. దీంతో కృష్ణను పిలిచి దానిని సరిచేయమని చెప్పారట నిర్మాత. కానీ కృష్ణ.. ఎవరో కుట్టిన డ్రెస్సును నేను సరిచేయను అని అప్పటికప్పుడే సేమ్ అటువంటి మరో డ్రెస్సును కట్టి ఇచ్చాడట.

- Advertisement -

ఇక కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తూనే.. భారత్ బంద్ సినిమాతో నటుడిగా మారారు కృష్ణ. కోడి రామకృష్ణ ఆయనకు నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో పొలిటీషియన్‌గా కృష్ణ అదరగొట్టాడు. థియేటర్లో ఈ సినిమాను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఉన్నట్టుండి ఆయన్ను తిన్నడం మొదలు పెట్టారట. అది చూసి అతని భార్య పిల్లలు సినిమా పూర్తిగా చూడకుండానే బయటకు వచ్చారట. ఆయనకు ఆ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. అందుకే కోడి రామకృష్ణ తన గురువు అని కృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News