BigTV English

Samantha : డార్క్ డేస్.. డైవర్స్ పై సమంత లేటెస్ట్ కామెంట్స్..

Samantha : డార్క్ డేస్.. డైవర్స్ పై సమంత లేటెస్ట్ కామెంట్స్..

Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఒక వైపు సినిమాను ప్రమోట్ చేస్తూనే తన జీవితంలో ఎదురైన అనుభవాలను చెప్పుకొస్తోంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై గతంలో సమంత పెద్దగా స్పందించేకాదు. కానీ శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో మాత్రం పదే పదే ఆ విషయాలను ప్రస్తావిస్తోంది.


తాజాగా సామ్ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో కీలక అంశాలను బయటపెట్టింది. విడాకులు, మయోసైటిస్‌ వ్యాధి ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను వివరించింది. వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నాటి రోజులను మరోసారి గుర్తు చేసుకుంది. అవి చీకటి రోజులుగా పేర్కొంది. ఆ బాధ నుంచి తానింకా పూర్తిగా కోలుకోలేదని చెప్పింది.

నాగచైతన్యతో సమంత విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. చైతు నుంచి భరణంగా చాలా డబ్బు తీసుకుందని రూమర్స్ గుప్పుమన్నాయి. గతంలోనే ఈ విషయాలను సమంత ఖండించింది. అయితే ఆ నాటి ట్రోలింగ్ గురించి ఇప్పుడు స్పందించింది. తాను ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలను చూశానని చెప్పింది. నాకు మంచే జరుగుతుందా? అంటూ రోజూ అమ్మని అడుగుతూనే ఉండేదాన్ని అని నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.


క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుండేవని అయితే కుటుంబసభ్యులు, స్నేహితులు వల్లే తాను ముందడుగు వేశానని సమంత చెప్పింది. అయితే ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని స్పష్టం చేసింది. గతంతో పోలిస్తే చీకటి రోజులు ఎంతో తగ్గాయని.. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాతే ధైర్యం పెరుగుతుందని వివరించింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×