Pushpa 2 Review : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప 2 ఒకటి. ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ఈ సీక్వెల్ డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి మరింత పెరగబోతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదివరకే పుష్ప సినిమాకి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇకపోతే పుష్ప సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధం అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ టీమ్ అంతా ఈ సినిమా చూసి టీం ని కొనియాడినట్టు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెన్సార్ రిపోర్ట్ తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా నిడివి మూడు గంటల 20 నిమిషాల పాటు ఉండనుంది. ఈ సినిమాలో మూడు చోట్ల బీప్స్ ను వాడినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కంప్లీట్ టాక్ వింటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఖచ్చితంగా పూనకాలు వస్తాయని చెప్పాలి. ఈ సినిమాని సుకుమార్ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒకదానిని మించిన సీన్స్ మరొకటి ఈ సినిమాలో ఉండబోతున్నాయి.
జపాన్ ఎపిసోడ్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ కీలకమని చెప్పాలి. 25 నిమిషాల పాటు జరిగే ఈ జాతర ఎపిసోడ్ సినిమాకి పైసా వసూల్ అని చెప్పాలి. మాస్ అప్పీల్ తో సాగిన క్లైమాక్స్ ఫైట్ నెక్స్ట్ లెవెల్. కాళ్లు చేతులు కట్టేసిన హీరో చేసే విధ్వంసం కళ్ళారా చూస్తుంటే ఆడియన్స్ కి గూస్బమ్స్ గ్రాంటెడ్. అయితే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ టు ఉంది అని చెప్పారు. కానీ గ్లిమ్స్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదు. పుష్ప శ్రీవల్లి మధ్య ఎమోషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే పుష్ప 1ని మించిన విజయాన్ని పుష్ప 2 సాధిస్తుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా భారీ స్కేల్ లో ఉండబోతుందని ఇదివరకే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయితే. త్రివిక్రమ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.
Also Read : Pushpa 2: ‘పుష్ప 2’ రన్ టైమ్ ఫిక్స్.. సుకుమార్ ఏం ప్లాన్ చేశారో!