BigTV English

Black Friday Offers: బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్లు.. డిస్కౌంట్లు చూస్తే మతిపోవాల్సిందే!

Black Friday Offers: బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్లు.. డిస్కౌంట్లు చూస్తే మతిపోవాల్సిందే!

బ్లాక్ ఫ్రైడే సేల్ గురించి ఇండియాలో వారికి పెద్దగా తెలియకపోయినా, అమెరికాలో మాంచి క్రేజ్ ఉంటుంది. ఈ సేల్ కోసం అక్కడి ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ హాలీడే షాపింగ్ సీజన్ నవంబర్ 29 నుంచి ప్రారంభం కాబోతోంది. అమెరికా, భారత్ సహా పలు దేశాల్లోని రిటైలర్లు అదిరిపోయే ఆఫర్లను అందించేందుకు రెడీ అవుతున్నారు. భారత్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


టాప్ బ్లాక్ ఫ్రైడే సేల్స్, ఆఫర్లు   

⦿ శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్


టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియాలో ఈ నెల 23న బ్లాక్ ఫ్రైడే సేల్‌ ను ఓపెన్ చేసింది. ప్రీమియం ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందిస్తున్నది. శాంసంగ్ అఫీషియల్ వెబ్‌ సైట్‌ తో పాటు ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్, ఇతర స్టోర్లలో ఈ ఆఫర్లను అందిస్తున్నది.  బ్లాక్ ఫ్రైడే బొనాంజాలో భాగంగా, Galaxy Z Fold 6ను రూ.1,44,999కే అందిస్తున్నది. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,64,999.  అటు Galaxy Z Flip 6 ధర రూ. 1,09,999 ఉండగా, ఇప్పుడు రూ. 89,999కే అందిస్తున్నది. ఈ మోడల్స్ పై నో కాస్ట్ EMI అందిస్తున్నది.

⦿జియో మార్ట్ ఎలక్ట్రానిక్స్

జియోమార్ట్ కస్టమర్లకు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 2000 వరకు అందిస్తున్నది. ఆఫర్ వ్యవధిలో నవంబర్ 29 వరకు చెల్లుబాటు అయ్యే వెలాసిటీ కార్డును అందిస్తున్నది.

⦿క్రోమా సేల్

క్రోమా రూ. 15,000 వరకు షాపింగ్ చేస్తే  10% ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 4000 వరకు అందిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. Apple, OnePlus, Xiaomi, TCL ఎలక్ట్రినిక్ గూడ్స్ మీద ఈ ఆఫర్లు లభిస్తాయి.

⦿ఫ్లిప్‌కార్ట్ సేల్

ఫ్లిప్‌కార్ట్  iPhone 15ను రూ. 57,749కే అందిస్తున్నది. దీని అసలు ధర రూ. 79, 900. iPhone 15 Plusను రూ. 65,999కే అందిస్తున్నది. ఇక హై-ఎండ్ iPhone 15 Pro Max ధర రూ. 1,59,999 కాగా రూ. 1,23,999కే అందిస్తున్నది.Moto G85 రూ. 1,000 తగ్గింపు ధరతో రూ.16,999కి అందిస్తున్నది. Moto Edge 50 Proను రూ. 29,999కి అందిస్తున్నది. Vivo V30 Pro ధర రూ. 41,999 ఉండగా, రూ. 33,999కి అందిస్తున్నది. ఇతర ఎలక్ట్రానిక్స్ పైనా గణనీయమైన తగ్గింపు అందిస్తున్నది.

⦿Tata CLiQ సేల్

Tata CLiQ ఫ్యాషన్, Tata CLiQ లగ్జరీ, Tata CLiQ పాలెట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ ను ప్రకటించాయి. నవంబర్ 23 నుండి డిసెంబర్ 2, 2024 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నది. ఇందులో భాగంగా లిమిటెడ్ అవర్ ఫ్లాష్ డీల్స్ అందుబాటులో ఉంచుతుంది. బ్రాండెడ్ దుస్తులు, షూపై 30 నుంచి 80% తగ్గింపు, వాచీలపై 50%, ఆభరణాలపై 55%, హోమ్ కేటగిరీలో 25% నుంచి 45% మధ్య తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నాయి.  మేకప్‌పై వస్తువులపై 15% నుంచి 60% శాతం తగ్గింపు అందిస్తున్నది. అటు ICICI బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ ప్రెస్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10% ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నది.

⦿BoB క్రెడిట్ కార్డ్ ఆఫర్లు

అటు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన BOBCARD బ్లాక్ ఫ్రైడే, వింటర్ సీజన్ సేల్స్ లో ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్, జియోమార్ట్, క్రోమా, పేటీఎమ్ లాంటి ఇ-కామర్స్ సంస్థల నుంచి చేసే కొనుగోళ్లపై 25 శాతం వరకు తగ్గింపులను అందిస్తోంది. ట్రావెల్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్యాషన్, బ్యూటీ థింగ్స్ మీద డిస్కౌంట్లు అందిస్తున్నది. BOBCARD కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ లో రూ. 25,000, అంతకంటే ఎక్కువ EMIపై కొనుగోలు చేస్తే 10% ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ.1,500 వరకు అందిస్తుంది. అదనంగా రూ. 750 తగ్గింపు అందిస్తున్నది. టూవీలర్లను EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 25 వేల వరకు తగ్గింపును అందిస్తున్నది. అటు అమెజాన్‌ లో తొమ్మిది నెలలకు మించి రూ. 30,000 వరకు EMI ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ.1,500 వరకు అందిస్తుంది. అదనంగా రూ. 500 తగ్గింపు పొందుతారు. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు వర్తిస్తుంది.

Read Also: బ్యాంకులకు ఏకంగా 17 రోజుల సెలవులు, ఎందుకో తెలుసా?

Related News

BSNL Offers: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

Big Stories

×