E-Paper
Advertisement

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసు.. బేబీ సినిమా నిర్మాతకు నోటీసులు..

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసు.. బేబీ సినిమా నిర్మాతకు నోటీసులు..
Advertisement
Hyderabad drugs case latest news

Hyderabad drugs case latest news(Telangana news live):

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గుడి మల్కాపురం పోలీసులతో కలిసి నార్కోటిక్స్ అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. ముగ్గురు నైజీరియన్లతోపాటు ఐదుగురి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన విషయాలను వెల్లడించారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి ఉన్నారని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు జరుపుతున్నాయని గుర్తించామన్నారు.  మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌రావును కూడా అరెస్ట్ చేశామన్నారు.

బేబీ సినిమా నిర్మాతకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బేబీ సినిమాలో మాదాపూర్ డ్రగ్స్ కేసు లాగానే సీన్ చూపించారని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇలాంటి సినిమాలు తీయవద్దని సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలకు సీవీ ఆనంద్ సూచించారు. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై నిఘా ఉంటుందన్నారు. బెంగళూరులో 18 మంది నైజీరియన్లు ఉన్నారని గుర్తించామని వివరించారు. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని సీవీ ఆనంద్‌ ప్రకటించారు.

Advertisement

అయితే బేబి సినిమా యూనిట్‌కు నోటీసులు అందడంపై స్పందించారు ఆ చిత్ర దర్శకుడు సాయితేజ్. చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి డైరెక్టర్ సీవీ ఆనంద్‌ను కలిశారు. కథ ప్రకారమే ఆ సన్నివేశంలో డ్రగ్స్‌ సీన్‌  పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చామన్నారు.

మరోవైపు డ్రగ్స్ కేసులో ఇండస్ట్రీలో ఉన్నవారి పేర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని అన్నారు సీపీ ఆనంద్. మదాపూర్ లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి మొబైల్స్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని.. అలాగే నైజీరియన్స్ వీసా గడువు ముగిసిన దేశంలో ఉన్నారని తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×