Daaku Maharaj Collection : నందమూరి బాలయ్య గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే మరో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన బాలయ్య మూవీ డాకు మహారాజ్.. ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ను అందుకుంది.. ఇప్పుడు ఐదు రోజులకు ఎన్ని కోట్లు అందుకుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వరుస విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ప్రేక్షకులను, అటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈ మూవీ మెప్పించింది. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీ మొదటి రోజే 56 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత రోజు నుంచి ఓపెనింగ్స్ తగ్గకుండా కలెక్షన్స్ను వసూల్ చేస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.. ఇక ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు రాబాట్టిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
డాకు మహారాజ్ ఐదు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. బాలయ్య కెరియర్ లోనే అత్యంత భారీ ఓపెనింగ్ రాబట్టిన సినిమా డాకు మహారాజ్. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 56 కోట్లు వసూలు చేసింది.. రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.18 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. సినిమా కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇక ఐదు రోజులకు 125 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. దీనిపై డాకు మహరాజ్ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.. ఇక ఇదే జోరులో మూవీ రన్ అయితే మాత్రం 200 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈ మూవీ ఎన్ని కోట్లు రాబడుతుందో ముందు ముందు చూడాలి..
ఈ మూవీ తర్వాత మరో రెండు మూవీలను లైన్ లో పెట్టుకున్నాడు బాలయ్య. అందులో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాలుగో మూవీగా అఖండ 2 రాబోతుంది. ఈ సినిమా ను పూజా కార్యక్రమాలతో గత ఏడాది ప్రారంభించారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగు సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోని సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు..