BigTV English

Sukumar Daughter: ‘పుష్ప’లో యాక్ట్ చేస్తానంటే నాన్న ఆ కండీషన్ పెట్టారు.. సుకుమార్ కూతురి కామెంట్స్

Sukumar Daughter: ‘పుష్ప’లో యాక్ట్ చేస్తానంటే నాన్న ఆ కండీషన్ పెట్టారు.. సుకుమార్ కూతురి కామెంట్స్

Sukumar Daughter: సినీ పరిశ్రమలో దర్శక, నిర్మాతల వారసులు అయినా కూడా వారు హీరో, హీరోయిన్లుగా మారాలనే కలలు కంటుంటారు. అందూర తమను తాము వెండితెరపై చూసుకోవాలని ఆశపడుతుంటారు. అలా ఇప్పటికే ఎంతమంది దర్శక, నిర్మాతలు తమ వారసులను హీరోహీరోయిన్లుగా మార్చారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నారు. సుకుమార్ వారసురాలు సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi) ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్న తన డెబ్యూ మూవీ ప్రమోషన్స్‌లో సుకృతి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.


నాన్న ఏమన్నారంటే?

‘గాంధీ తాత చెట్టు’ అనే డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కే సోషల్ మెసేజ్ డ్రామాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుకుమార్ వారసురాలు సినీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అవ్వడం మాత్రమే కాకుండా అప్పుడే సుకృతికి అవార్డులను కూడా తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇక ఫైనల్‌గా ‘గాంధీ తాత చెట్టు’ థియేటర్లలో విడుదలయ్యే సమయం వచ్చేసింది. దీంతో మేకర్స్ అంతా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆ ప్రమోషన్స్‌లో సుకృతి కూడా యాక్టివ్‌గా పాల్గొంటోంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ‘పుష్ప’లో తను యాక్ట్ చేయాలని అనుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ దర్శకుడి వారసురాలు.


Also Read: శాండిల్‌వుడ్‌లో యశ్ క్రేజ్.. ఏ హీరోకు దక్కని ఘనత దక్కించుకున్న రాకీ భాయ్

నిజానికి ఏమైందంటే?

‘‘నేను పుష్పలో, పుష్ప 2లో యాక్ట్ చేస్తానని నాన్నను అడిగాను. ఎందుకంటే మా టీచర్స్, ఫ్రెండ్స్, నాకు తెలిసినవాళ్లు అందరూ నువ్వు పుష్పలో యాక్ట్ చేస్తున్నావా అని అడిగేవారు. చేయట్లేదు. నాకే చేయాలని అనిపించలేదు. నేను చిన్నపిల్లను కదా అందుకే యాక్ట్ చేయలేదని అనుకున్నారు. కానీ నిజంగా జరిగింది అది కాదు. మా నాన్నను అడిగినప్పుడు ఆడిషన్ చెయ్యి ఆ తర్వాత చూద్దామని నాన్న అన్నారు’’ అంటూ అసలు విషయం బయటపెట్టింది సుకృతి వేణి. దీంతో సొంత కూతురికి కూడా ఒక రోల్ ఇవ్వాలంటే ఆడిషన్ పెట్టే తండ్రి సుకుమార్ (Sukumar) అంటూ తన కూతురు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కూతురి వంతు

‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్‌గా మారిపోయాడు సుకుమార్. ఆ మూవీ మూడేళ్ల క్రితం విడుదలయ్యి యావరేజ్ టాక్‌తో కోట్లు కొల్లగొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, డైలాగులు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఫేమస్ అయిపోయాయి. దీంతో సినిమా కూడా పాన్ ఇండియా హిట్‌గా మారిపోయింది. ‘పుష్ప 2’ విషయంలో కూడా అదే జరిగింది. ముందుగా ఈ మూవీ రిలీజ్ అవ్వగానే దీనికి కూడా మిక్స్‌డ్ టాకే లభించింది. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతూ వేగంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ సాధించింది. దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు సుకుమార్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుకృతికి తన టాలెంట్ నిరూపించుకునే సమయం వచ్చేసిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×