Daaku Maharaj :, నందమూరి హీరో బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ ‘.. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే. ప్రతి ఏడాది సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది కూడా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో సంక్రాంతి పండుగను చేసుకున్నారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. డాకు మహారాజ్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగానే జరిగాయి. కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి..
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు అందించారు. అఖండ మూవీ నుంచి బాలయ్యకు వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. సంక్రాంతి సెంటిమెంట్ బాలయ్యకు బాగా వర్కౌట్ అయ్యింది. లేటెస్ట్ గా వచ్చిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్ పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఎలా ఉందో అని ఫ్యాన్స్ తెలుసుకోవాలని చూస్తున్నారు. అసలు ఈ మూవీ కలెక్షన్స్ అంచనాలను రీచ్ అయ్యిందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్ల టార్గెట్ తో మూవీ వచ్చింది.. అయితే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఏపీ, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , స్పెషల్ కారణంగా బుకింగ్స్‌లో ఎక్సలెంట్ హోల్డ్ చూపించింది. దాంతో అంతవరకే కలెక్షన్స్ వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. మరి ఎంత వసూల్ చేసిందో చూడాలి.. టీమ్ నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ పై డైరెక్టర్ బాబీ ఆశలు పెట్టుకున్నారు. హిట్ కొట్టాడా? లేదా అన్నది తెలియనుంది. ఇకపోతే బాలయ్య ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అఖండ 2 మూవీ షూటింగ్ అప్డేట్ రాబోతుందని సమాచారం..