Daaku Maharaj Hindi Collections.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ సంక్రాంతికి జనవరి 12వ తేదీన విడుదల చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది.
చతికిల పడ్డ కలెక్షన్స్..
ఇకపోతే టాలీవుడ్లో భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమాని నార్త్ లో జనవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. కథలో చాలా భాగం నార్త్ ఆడియన్స్ అభివృద్ధికి తగినట్లే రూపొందించారు. 1980లో దాదాపు దశాబ్దన్నర పాటు పోలీసులను, రాజకీయ నాయకులను ముప్పుతిప్పలు పెట్టిన ‘మాన్సింగ్’ బయోగ్రఫీని రెఫరెన్స్ గా పెట్టుకొని ఈ డాకు మహారాజ్ సినిమాను రూపొందించారు. అందుకే ఈ సినిమా నార్త్ జనాలకు బాగా ఎక్కుతుందని, ఎగబడి చూస్తారని కూడా మేకర్స్ భావించారు. కానీ ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సందడి చేయడం లేదు. పైగా వీకెండ్ కలెక్షన్స్ కేవలం రూ.5లక్షలు మాత్రమే రావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ కలెక్షన్స్ ఇప్పటివరకు ఎవరి మూవీకి రాలేదని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే హిందీ బెల్టులో ఈ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందని కూడా అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి l. పైగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) ఇందులో నటించినా.. బాలీవుడ్ లో తన మ్యాజిక్ చూపించలేక పోయింది. దాంతో ఈ సినిమాకి వీకెండ్స్ పెద్దగా వర్కౌట్ కాలేదని సమాచారం.
అఖండ 2 పై ప్రభావం..
ఇదిలా ఉండగా గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్లో ‘అఖండ’ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా అప్పుడే ప్రకటించారు. ఇక ఎప్పుడెప్పుడు సెట్ పైకి వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు తాజాగా మహాకుంభమేళా జరుగుతున్న వేళ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు బోయపాటి శ్రీను. ముఖ్యంగా ఆయన నిర్మాతలకు ఖర్చు తగ్గించడానికి మహాకుంభమేళను తన సినిమా షూటింగ్లో ఒక భాగం చేశారు. అక్కడికి వెళ్లి నేరుగా షూటింగ్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు బోయపాటి శ్రీను. ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటి స్టెప్ గా డాకు మహారాజ్ సినిమాను నార్త్ లో విడుదల చేశారు. కానీ తాజాగా అక్కడ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ డిజాస్టర్ ప్రభావం అఖండ 2 పై పడుతుందేమో అని అభిమానులు సైతం కంగారు పడుతున్నారు. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే.. ఇందులో ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి , ఊర్వశీ, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఇకపోతే అఖండ 2 లో కూడా ప్రగ్యా జైస్వాల్ నటించబోతోందిఅంటూ వార్తలు వినిపించినా.. ప్రస్తుతం ఆమెని తొలగించి యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ను చేర్చుకున్నారు. అంతేకాదు సంయుక్త మీనన్ అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.