Sookshmadarshini: సినిమా.. మూడు గంటల వినోదం. రోజంతా అలిసిపోయినవారిని కొద్దిసేపు నవ్వుకునేలా.. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడానికి మాత్రమే సినిమా తీయడం స్టార్ట్ చేశారు. కానీ.. జనరేషన్ పెరిగేకొద్దీ.. ఆ సినిమానే ఒక పెద్ద ఇంధనంగా వాడుకొని.. మనుషులను ప్రభావితం చేసేవారు. మంచిని ప్రజలకు తెలియజేయడానికి సినిమాను ఉపయోగించేవారు.
కానీ, ఇప్పుడున్న జనరేషన్.. సినిమాలో ఉన్న మంచిని వదిలేసి.. చెడును మాత్రమే గ్రహిస్తుంది. అందుకే ప్రజలను బాగుచేయాలి అన్న మెసేజ్ ఉన్న సినిమాలకన్నా చెడగొట్టే సినిమాలే ఎక్కువ హిట్ అవుతున్నాయి. ఆ సినిమాలను చూసి తాము కూడా అలాగే చేయాలనీ యువత కోరుకుంటుంది. పుష్ప సినిమాచూసి.. కొంతమంది అందులో చేసినట్టుగానే స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డారు.. ఇంకోచోట దృశ్యం సినిమా చేసి.. ఒక హత్య చేసి.. ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టారు.
ఇక ఇప్పుడు మీర్పేట్ మర్డర్ కేసులో కూడా ఒక సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యి తన భార్యను చంపినట్లు నిందితుడు గురుమూర్తి చెప్పడం సంచలనం సృష్టించింది. భార్య మాధవిని చంపి.. ముక్కలు ముక్కలుగా కోసి.. కుక్కర్ లో ఉడికించి.. బాత్ రూమ్ ఫ్లష్ లో వేసినట్లు గురుమూర్తి తెలిపాడు. మలయాళ సినిమా సూక్ష్మదర్శిని సినిమా చూసి.. ఇదంతా చేసినట్లు తెలిపాడు. దీంతో ఒక్కసారిగా అసలు ఆ సినిమాలో ఏముంది.. ? అనే అనుమానాలు అందరిలోనూ మెదులుతుంది. మరి ఆ సినిమా ఎక్కడుంది.. ? అందులో ఏముంది.. ? ఎవరెవరు నటించారు.. ? ఎక్కడ చూడొచ్చు.. ? అనేది తెలుసుకుందాం.
Manchu Lakshmi: వాళ్లు నన్ను వేధించారు.. దురుసుగా ప్రవర్తించారు.. మంచు లక్ష్మీ ఆగ్రహం
మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్, జయజయజయహే ఫేమ్ బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సూక్ష్మదర్శిని. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా MC జితిన్ దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రూ. 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 55 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ నెలలో సూక్ష్మదర్శిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే.. ప్రియ( నజ్రియా నజీమ్) భర్త, కూతురుతో కలిసి ఒక కాలనీలో నివసిస్తూ ఉంటుంది. ఆమెకు ఉద్యోగం లేకపోవడంతో.. ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ కాలనీలో ఉండే లేడీస్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. కాలనీలో ఏది జరిగినా.. ఆ గ్రూప్ లో లేడీస్ అందరూ మాట్లాడుకుంటారు. ఇక ఇంట్లో ఖాళీగా ఉండడం వలన.. ప్రియకు చుట్టుపక్కల విషయాలను తెలుసుకోవడంలో కుతూహలం ఎక్కువగా ఉంటుంది.
ఇక ప్రియ ఇంటిపక్కన ఉన్న ఇంట్లోకి మ్యానుయేల్ (బాసిల్ జోసెఫ్) తన తల్లి గ్రేసీతో కలిసి దిగుతాడు. అయితే అది వారి సొంత ఇల్లు అని, వారికి బేకరీ ఉందని.. ఇప్పుడు వేరేచోట ఉండడంతో.. ఇక్కడకు రాలేదని గ్రూప్ లో తెలుస్తోంది. మ్యానుయేల్ అందగాడు, ఆస్తిపరుడు కావడంతో.. చుట్టుపక్కల ఉన్న పెళ్లి కానీ అమ్మాయిలందరికి అతడు నచ్చుతాడు. ఇక అందరూ బాగానే ఉన్నా.. ప్రియకు.. మ్యానుయేల్ మీద మొదటి నుంచి అనుమానం వస్తుంది.
TJ Harshavardhan: నా భార్య నన్ను వేధిస్తోంది.. నటిపై ఫిర్యాదు చేసిన డైరెక్టర్ హర్షవర్ధన్
మ్యానుయేల్ తల్లి గ్రేసీకి అల్జీమర్స్ అని.. ఆమె ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో తెలియదని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్నీ ప్రియ నమ్మదు. కొడుకే తల్లిని ఏదో చేస్తున్నాడని అనుమానిస్తూ ఉంటుంది. రెండు సార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన గ్రేసీకి.. ఇంట్లో కుక్కర్ కరెక్ట్ గా ఆఫ్ చేయడం తెలుసనీ, వర్షం పడినప్పుడు బట్టలు తీయడం తెలుసు అని ప్రియ వాదిస్తోంది. ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి తన పక్కింట్లో ఉన్న ఇంకో ఇద్దరు లేడీస్ తో కలిసి మ్యానుయేల్ ఇంటికి వెళ్లి చెక్ చేస్తోంది.
తల్లి కనిపించలేదని అమెరికా నుంచి డయానా ఇంటికి వచ్చి.. వెంటనే వెళ్ళిపోతుంది. తల్లి కనిపించలేదన్న బాధ ఆమెలో ఇసుమంత లేకపోవడంతో.. ఇక్కడ ఏదో జరుగుతుందనే అనుమానాన్ని ప్రియ.. డయానాతో పంచుకుంటుంది. ఆమె రెండు మూడుసార్లు మెసేజ్ కు రిప్లై ఇస్తుంది కానీ, కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రియ అనుమానం ఇంకా బలపడుతుంది. ఇక చివరికి ప్రియ.. మ్యానుయేల్ ఇంటి బాత్ రూమ్ పైప్ నుంచి రక్తం కారడం చూసి ఆ రక్తాన్ని సేకరించి ల్యాబ్ కు పంపిస్తుంది. తల్లిని చంపి మ్యానుయేల్ అబద్దాలు ఆడుతున్నడనీ అనుకుంటుంది. కానీ, ఆ రక్తం తల్లి గ్రేసీది కాదు.. అక్క డయానాది అని బయటపడుతుంది.
ఇక అసలు కథ ఏంటి అని ప్రియ ఇన్వేసిగేషన్ చేయగా.. డయానా ఒక లెస్బెనియన్. అమెరికాలో ఆమె.. ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వారిద్దరూ కలిసి ఒక చిన్నారిని దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇక తన కూతురు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పరువు తక్కువగా భావించిన తల్లి గ్రేసీ.. కొడుకు మ్యానుయేల్ తో కలిసి కూతురు డయానాను చంపడానికి ప్లాన్ చేస్తుంది.
తనకు అల్జీమర్స్ ఉందని, ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు అందరిని నమ్మించి డయానాను అమెరికానుంచి రప్పించి.. చంపేస్తారు. శవాన్ని బయటకు తీసుకురాకుండా.. ఇంట్లోనే ముక్కలు ముక్కలుగా నరికి.. కెమికల్స్ వాడి.. ఒక టబ్ లో ఉడకబెట్టి.. బాత్ రూమ్ లో ఫ్లష్ చేస్తారు. ఆ రక్తమే.. ప్రియ కంటబడి వారి గుట్టురట్టు అవుతుంది. సేమ్ ఇదే క్రైమ్ సీన్ ను మీర్పేట్ లోని నిందితుడు గురుమూర్తి రీక్రియేట్ చేశాడు. భార్య మాధవిని ఇంట్లోనే చంపి.. కుక్కర్ లో ఉడికించి.. కెమికల్స్ కలిసి.. ఆ రక్తమాంసాలను ఫ్లష్ ద్వారా పంపించాడు. ఈ సినిమాను వారు కల్పిత కథగా తెరకెక్కించగా.. ఇప్పుడు అదే కథ ఒక హత్యకు కారణమయ్యింది.