Daaku Maharaaj Pre Release Event : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేయగా, సడన్ గా దానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తాజాగా కొత్త ముహూర్తాన్ని మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు, ఎక్కడ ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్…
బాలయ్య హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ల పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ఊర్వశి రౌతెల కీలక పాత్రతో పాటు “దబిడి దిబిడి” అనే స్పెషల్ సాంగ్‌లోనూ కనిపించబోతోంది. జనవరి 12న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసాయి.
ఇక ఈ రోజే జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన సంగతి తెలిసిందే. ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం డాకు మహరాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం అంటే రేపు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యూసుఫ్ గూడా పోలీసు గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతికి కూడా ట్రై చేస్తున్నారట. మరి ప్రభుత్వం ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈవెంట్ వాయిదాకు కారణం ఇదే
ఇదిలా ఉండగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా అనంతపురంలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈవెంట్ కు ముఖ్య అతిథిగా బాలకృష్ణ అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ రాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. కానీ తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా పోస్ట్ చేసింది. “తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్ర బృందం అంతా బాధపడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను పెట్టుకోవడం సరికాదు. ఈవెంట్ ను రద్దు చేస్తున్నాము’ అని వెల్లడించారు.