IT instructor jobs: బీటెక్, ఎంటెక్, ఎంసీఏ(కంప్యూటర్) అర్హత ఉన్న వారికి శుభవార్త. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జర్నలిజం డిగ్రీ పూర్తి చేసినవారు కూడా మరి కొన్ని ఉద్యోగాలకు అర్హులవుతారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 65 ఐటీ ఇన్‌స్ట్రక్టర్, రెండు పీఆర్‌ఓ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 67
ఇందులో రెండు రకాలు ఉద్యోగాలున్నాయి. 65 ఐటీ ఇన్‌స్ట్రక్టర్, రెండు పీఆర్ఓ ఉద్యోగాలున్నాయి.
విద్యార్హత: ఐటీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఎంటెక్/బీటెక్/ఎంసీఏ (కంప్యూటర్స్) పూర్తి చేసిన వారు, పీఆర్‌ఓ పోస్టుకు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
దరఖాస్తు తేది: ఆసక్తి ఉన్న వారు జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: AIIMS Recruitment: గోల్డెన్ ఛాన్స్.. టెన్త్ క్లాస్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.70,000
అభ్యర్థులు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలలోగా మాసబ్‌ట్యాంక్‌లోని దేశోద్ధారక భవన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.