Daaku Maharaj Trailer:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna), ప్రముఖ డైరెక్టర్ బాబీ (Bobby )దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఎన్నో అంచనాల మధ్య జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను తాజాగా ఈరోజు ఉదయం విడుదల చేశారు. నిన్న సాయంత్రం అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. ఇప్పుడు ఇండియాలో విడుదల చేసి అభిమానులలో కొత్త జోష్ నింపారు బాలయ్య. అమెరికాలోని డల్లాస్ లో గ్రాండ్ స్కేల్ లో ఉన్న టెక్సాస్ ట్రస్ట్ థియేటర్ వేదికగా ఈ థియేటర్ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ వేడుకకు నందమూరి అభిమానులు ‘జై బాలయ్య’ అనే స్లోగన్స్ తో కార్యక్రమాన్ని హోరెత్తించారు.
ట్రైలర్ తోనే అదరగొట్టేసిన బాలయ్య..
బాబీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), ఊర్వశీ రౌతేలా(Urvasi Rautela), శ్రద్ధ శ్రీనాథ్(Shraddha shrinath), చాందినీ చౌదరి(Chandini Chowdary) తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ ట్రైలర్ లో అన్ని అంశాలు కూడా జోడించే ప్రయత్నం చేశారు మేకర్స్. యాక్షన్, ఎమోషన్ తో ఈ ట్రైలర్ చాలా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో “కింగ్ ఆఫ్ జంగిల్” అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ సూపర్ గా ఉన్నాయి. ప్రతి నాయకుడిగా బాబీడియోల్(Bobby Deol) అంచనాలను మరింత పెంచేసి, సినిమాను హిట్ చేసే దిశగా అడుగులు వేసినట్లు అనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్లో తమన్ (Thaman) సంగీతం, బాలయ్య యాక్షన్ ‘ డాకు మహారాజ్ ‘ పై అంచనాలను భారీగా పెంచేసిందని చెప్పవచ్చు.
డైలాగ్స్ అదుర్స్..
ముఖ్యంగా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. “చెడ్డ వాళ్లకు డాకు.. మంచి వాళ్లకు మహారాజు” అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. సంక్రాంతి విన్నర్ బాలయ్య అంటూ బాబీ చెబుతుండగా.. ఇంతకుముందు ఎప్పుడు కనిపించని బాలయ్యను ఈసారి చూస్తారంటూ కూడా నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా తెలిపారు. అలా ఒకరి తర్వాత ఒకరు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ముఖ్యంగా 2025 బ్లాక్ బాస్టర్ ఓపెనింగ్ తో ప్రారంభం కాబోతోంది అని కూడా కామెంట్లో చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సినిమా కథ ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ట్రైలర్ అదిరిపోయేలా ఉండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
నిర్మాతలు వీరే..
ఇక ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిపి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ఇక సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను అమెరికాలో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు విడుదల చేస్తున్నారు.