Daaku Maharaj Trailer launch Event :నరసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ వయసులో కూడా దూకుడు చూపిస్తూ.. వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే తన అద్భుతమైన నటనతో వరుస బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇదివరకే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ, తాజాగా బాబీ (Bobby) దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్నారు. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం.
వాయిదా పడ్డ డాకు మహారాజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
అందులో భాగంగానే సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు జనవరి 2వ తేదీన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించి, ట్రైలర్ లాంచ్ చేయాలని ప్లాన్ కూడా చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం గేమ్ ఛేంజర్ (Game Changer)అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే, ప్రముఖ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan)తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే జనవరి ఒకటవ తేదీన ట్రైలర్ రిలీజ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ రేపటికి వాయిదా వేయడం జరిగింది. అలా జనవరి 2వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుండడంతో.. డాకు మహారాజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయం అభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తోంది అని చెప్పవచ్చు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ప్లాన్..
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని ఈ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మంగళగిరి సైడ్ ఈ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఇదిలా ఉండగా మరొకవైపు గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాజమండ్రిలో జనవరి 4వ తేదీన ఓపెన్ గ్రౌండ్లో చాలా ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఆంధ్రాలోని మంగళగిరి సైడే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పుడు రామ్ చరణ్, బాలకృష్ణ తో పాటు కూటమి ప్రభుత్వం కూడా ఈ సినిమాలను ప్రెస్టేజ్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. మరి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా సీఎం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.