BigTV English

Dancer Tony Kick: ఎట్టకేలకు స్పందించిన జాను లిరి మాజీ భర్త.. చచ్చిబ్రతికా.. అది పెద్ద శాడిస్ట్..!

Dancer Tony Kick: ఎట్టకేలకు స్పందించిన జాను లిరి మాజీ భర్త.. చచ్చిబ్రతికా.. అది పెద్ద శాడిస్ట్..!

Dancer Tony Kick: జాను లిరి (Janu Lyri).. గతవారం రోజులుగా సోషల్ మీడియాలో ఈమె గురించి, ఈమె రెండో పెళ్లి గురించి వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తనను మానసికంగా హింసిస్తున్నారని, తన కొడుకుతో జీవితాంతం సంతోషంగా జీవిద్దాం అనుకుంటే ఇప్పుడే చంపేసేలా ఉన్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ వీడియో వదిలి అందరికీ దూరమైన జానూ లిరి, మరుసటిరోజే సింగర్ దిలీప్ (Singer Dilip) ను వివాహం చేసుకోబోతున్నాను అంటూ ప్రకటించింది. అటు సింగర్ దిలీప్ కూడా జాను తో పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, ఇకపై ఎవరు ఎన్ని రూమర్స్ సృష్టించినా తనకు నో ప్రాబ్లం అంటూ దిలీప్ తెలిపారు.


మళ్లీ పెళ్లికి సిద్ధమైన జానూ లిరి..

ఇక ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుంటూ ఉండడంపై పలువురు పలు రకాల కామెంట్లు చేస్తుండగా.. మరొకవైపు జాను మొదటి భర్త గురించి పలు వార్తలు వైరల్ గా మారాయి. దీంతో తాజాగా ఆయన ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టి, జాను లిరి గుట్టు రట్టు చేశారు. నిజానికి జాను తన పెళ్లి ప్రకటన ఎప్పుడైతే చేసిందో.. ఈమె మొదటి భర్త డాన్సర్ టోనీ కిక్ (Tony Kick) గురించి కూడా చర్చ మొదలయింది. టోనీ, జాను ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి లిరి అనే కొడుకు కూడా జన్మించారు. జాను కి పెళ్లి వయసు రాకుండానే టోనీ ప్రేమలో పడింది. ఆమె ప్రపోజ్ చేసి చివరికి అతడిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇద్దరు కలిసి పలుషోలలో పాల్గొన్నారు. కలసి డాన్స్ చేసేవాళ్లు.. పాటలు కూడా పాడేవారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా, కొడుకు పుట్టిన తర్వాత సంతోషంగా ఉన్న జీవితంలో అనూహ్యంగా విభేదాలు తలెత్తాయి. అలా కొడుకు పుట్టిన నాలుగేళ్ల తర్వాత టోనీతో విభేదాలు కారణంగా ఆమె విడిపోయింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న జానూ ఇప్పుడు ఫోక్ సింగర్ ను వివాహం చేసుకోబోతోంది.


నా కొడుకుని నాకు దూరం చేసింది – టోనీ కిక్..

ఇప్పుడు ఈ క్రమంలోనే టోనీ గురించి వార్తలు వస్తుండగా టోని మాట్లాడుతూ..” ఎప్పుడైతే నా జీవితంలో బ్రేకప్ అయిందో.. అప్పుడే ఆ టోని చనిపోయాడు. చచ్చి బ్రతికిన తటోనీ ఇలా ఉన్నాడు అంటే, అది నా స్నేహితుల వల్లే” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు టోనీ. విభేదాలు, విడిపోవడం పై మాట్లాడుతూ..” ఎందుకు విడిపోయాం అనే విషయాన్ని పక్కన పెడితే,దానికి కారణాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఆమె గురించి మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు. ఎవరైనా నీకు నీ భార్య గుర్తుకు రాదా అంటే.. నిజంగా రాదు అని చెబుతాను. ఎందుకంటే అంత నరకం అనుభవించాను. తను నన్ను వదిలేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. కానీ బాబు విషయంలోనే బాధగా ఉంటుంది. ఎంతైనా వాడు నా కొడుకు కాబట్టి వాడితో ఫోన్ కూడా మాట్లాడనివ్వదు. నాన్న అనే పిలుపుకు చాలా దూరం అయ్యాను. నాకు నా కొడుకు అంటే చాలా ఇష్టం. వాడి జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నాను. నా దగ్గర వాడి వీడియోలు ఉన్నాయి. గుర్తు వచ్చినప్పుడల్లా ఆ వీడియోలు చూస్తాను.వాడికి దూరంగా ఉండలేకపోతున్నాను. కానీ తప్పదు దానివల్లే ఇదంతా కానీ భవిష్యత్తులో నా కొడుకుకి మంచి భవిష్యత్తును నిర్మిస్తాను అంటూ తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×