BigTV English

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. భారత్ అలర్ట్, ఎయిర్‌పోర్టులు మూసివేత

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. భారత్ అలర్ట్, ఎయిర్‌పోర్టులు మూసివేత

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది. దాయాది దేశం నుంచి ముప్పు పొంచి వుందని పసిగట్టింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రతీకార చర్యలకు దిగితే తమ పౌరులకు ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది భారత్. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో జమ్మూ, లేహ్, శ్రీనగర్, అమృత్‌సర్ ఎయిర్ పోర్టులను మూసివేసింది.


తదుపరి నోటీసులు వచ్చే వరకూ తాజా ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది. సరిహద్దు వెంబడి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చేరుకున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దు వెంబడి మిసైళ్లను మొహరించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు దిగుతోంది.

ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు ఉత్తర భారత్‌లోని అనేక విమానాశ్రయాలకు సంబంధించి అడ్వైజరీలను జారీ చేశాయి. విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. ప్రయాణానికి ముందు విమాన రాకపోకల గురించి తెలుసుకోవాలని ఎయిరిండియా, ఇండిగో సంస్థలు ప్రయాణికులను కోరాయి.


ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ స్టేషన్లకు బయలుదేరే అన్ని విమానాలను మే 7న(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దు చేసింది ఎయిర్ ఇండియా. అమృత్‌సర్‌కు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించినట్టు తెలిపింది. ఊహించని అంతరాయం కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది.

ALSO READ: ప్రతీకారం తీర్చుకున్న భారత్, పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు

మరోవైపు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ అడ్వైజరీని జారీ చేసింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్​, లేహ్, ఛండీగఢ్, ధర్మశాల నుంచి రాకపోకలు సాగించే విమానాలపై ప్రభావం పడనుంది. అంతేకాకుండా గగనతల ఆంక్షల నేపథ్యంలో బికనీరు‌కు వచ్చే విమానాలపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ విమానాశ్రయాల ద్వారా బయలుదేరు, రాకపోకలు కనెక్టింగ్ విమానాలన్నీ ప్రభావితం చూపుతుందని అధికారులు తెలిపారు.

అంతేకాకుండా గగనతల ఆంక్షల నేపథ్యంలో బికనీరు‌కు వచ్చే విమానాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు అధికారులు. అమృత్‌సర్‌కు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించారు. అంతేకాకుండా ఎయిర్‌పోర్టు మూసివేసిన నేపథ్యంలో శ్రీనగర్‌కు ఇవాళ ఎలాంటి విమానాలు నడవడం కష్టమని చెప్పారు.

ఆపరేషన్ సింధూర్’ తో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆదేశంలోని కీలకమైన ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో నగరాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైద్య అధికారులకు సెలవులను రద్దు చేసింది ఆదేశం. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.  లాహోర్‌, సియాల్‌ కోట్ ఎయిర్‌పోర్ట్‌లను మూసివేసింది.

 

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×