BigTV English

Fatima Sana Shaikh: కొందరైతే నేరుగా అడిగి హింసించేవారు.. క్యాస్టింగ్ కౌచ్ పై దంగల్ నటి కామెంట్స్..!

Fatima Sana Shaikh: కొందరైతే నేరుగా అడిగి హింసించేవారు.. క్యాస్టింగ్ కౌచ్ పై దంగల్ నటి కామెంట్స్..!

Fatima Sana Shaikh: నటి ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh). ఇండియా వ్యాప్తంగా పేరున్న హీరోయిన్. ఈమె నటించిన ఒకే ఒక్క సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. అమీర్ ఖాన్ (Aamir Khan)హీరోగా చేసిన దంగల్ (Dangal Movie) మూవీ ఇప్పటికి కూడా బుల్లితెర మీద వస్తే ఎంతోమంది ఇష్టంగా చూస్తారు. ఈ సినిమాలో గీతా ఫోగట్ పాత్రలో ఫాతిమా సనా షేక్ అద్భుతంగా నటించింది. అలా ఎంతోమంది ప్రశంసలు అందుకున్న దంగల్ మూవీ ఇండియాలోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా దాదాపు రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేయడంతో.. హైయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఇప్పటివరకు దంగల్ రికార్డును బ్రేక్ చేసిన సినిమా ఏది లేదు. అయితే ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.


కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ఫాతిమా..

ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంత మంది డైరెక్టుగానే అన్నింటికీ సిద్ధంగా ఉన్నావా అని నన్ను అడిగారు.ఇక ఓ డైరెక్టర్ అయితే అన్నింటికీ సిద్ధంగా ఉంటేనే ఇందులోకి రావాలి..నీకు ఓకేనా అని డైరెక్టుగా అడిగాడు. కానీ నేను మాత్రం మీరు ఇచ్చిన పాత్రకి 100% ఇస్తాను. ఆ పాత్రకి 100% న్యాయం చేయగలను అని మాట్లాడాను.కానీ ఆ డైరెక్టర్ మాత్రం నా నుండి ఇంకా వేరేది ఆశించారు. వారి కోరిక తీర్చుకోవడం కోసం నాతో అలా మాట్లాడారు. కానీ ఆయన అంత డైరెక్ట్ గా నీచమైన మాటలు ఎలా మాట్లాడారో నాకర్థం అవ్వలేదు” అంటూ ఫాతిమా సనా షేక్ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు చేసింది. అలాగే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వారి దగ్గర కొంతమంది కాస్టింగ్ aáడైరెక్టర్లు ఆ నటీనటులకు వచ్చే రెమ్యూనరేషన్ లో 15% వాటా తీసుకుంటారు. అలా నేను ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో చాలామంది కాస్టింగ్ డైరెక్టర్లు నాకు వచ్చే రెమ్యూనరేషన్ లో 15% వాటా తీసుకొని మిగిలినవి నాకు ఇచ్చేవారు. ఇలాంటి నీచమైన వ్యక్తులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు అంటూ ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. అయితే అందరూ అలా కాదు కొందరు మంచి వాZళ్ళు కూడా ఉంటారు అని గుర్తు చేసుకుంది.


ఫాతిమా జీవితంపై అది మాయని మచ్చ..

ఇక ఫాతిమా సనా షేక్ లైఫ్ లో ఒక చేదైన వార్త ఏమిటంటే.. దంగల్ సినిమాలో ఎవరికైతే కూతురుగా నటించిందో ఆయనతోనే ఎఫైర్ వార్తలు రావడం.. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ (Aamir Khan)కి ఫాతిమా కూతురు పాత్రలో నటించింది. అయితే ఆ తర్వాత వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (Thugs of Hindusthan) సినిమాలో జత కట్టడంతో వీరిద్దరి మధ్య రూమర్స్ వినిపించాయి.అంతేకాదు అప్పట్లో అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుకి విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఫాతిమా పేరే తెర మీద వినిపించింది. ఇక సోషల్ మీడియాలో ఫాతిమా పేరు ఎంతలా వైరల్ అయింది అంటే ట్విట్టర్ మొత్తం కిరణ్ రావు, అమీర్ ఖాన్ విడాకుల(Kiran Rao- Aamir Khan Divorce) కు ఫాతిమానే కారణం అంటూ ఫోటోలతో సహా పోస్టులు పెట్టారు. అయితే ఈ వార్తలపై స్పందించిన ఫాతిమా అంత చెత్త వార్తలు ప్రచారం చేయకండి అయినా నా గురించి ఏం తెలుసని మీరు చెత్త వార్తలు రాస్తున్నారు అని ఫైర్ అయింది.అయినప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగకుండా అమీర్ ఖాన్ తో ఎఫైర్ ఉంది అని కామెంట్ చేశారు. అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్, ఫాతిమా ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో పాటు ఫాతిమా ముంబై వచ్చిన ప్రతిసారి అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడంతో ఈ రూమర్లు వినిపించాయి. అలా ఫాతిమా సినీ లైఫ్ లో వినిపించిన చెత్త రూమర్ ఇదే. ఇక ఫాతిమా సనా షేక్ చివరిగా 2023 లో వచ్చిన సామ్ బహదూర్ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×