E-Paper
Advertisement

SSMB29 : మహేష్ – జక్కన్న అడ్వెంచర్ థ్రిల్లర్ లో మరో బీటౌన్ స్టార్… ‘సలార్’ హీరోని పక్కన పెట్టేశారా ?

SSMB29 : మహేష్ – జక్కన్న అడ్వెంచర్ థ్రిల్లర్ లో మరో బీటౌన్ స్టార్… ‘సలార్’ హీరోని పక్కన పెట్టేశారా ?
Advertisement

SSMB29 : దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) నెక్స్ట్ మూవీ SSMB29 చిత్రం గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు (Mahesh Babu)తో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రొమాన్స్ చేయనుందని ఇప్పటికే కన్ఫామ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)ని తప్పించి, ఆయన స్థానంలో బాలీవుడ్ స్టార్ ను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది.

పృథ్వీరాజ్ ప్లేస్ ను రీప్లేస్ చేసిన హీరో 

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రాబోతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB29 గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రాతో పాటుమరో బాలీవుడ్ స్టార్ భాగం కాబోతున్నారని అన్నారు. ముందుగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ను అనుకున్నారు. కానీ ఆయన సినిమా నుంచి తపుకోవడంతో, పృథ్వీరాజ్ స్థానంలో మరో బాలీవుడ్ నటుడిని మేకర్స్ తీసుకున్నారని అంటున్నారు.  మీడియా కథనాల ప్రకారం, జాన్ అబ్రహం (John Abraham) SSMB29  సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను రీప్లేస్ చేయబోతున్నారు.

ఇప్పటికే ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకుని, SSMB29  వర్క్ షాప్స్ లో పాలు పంచుకుంటోంది. అలాగే జాన్ అబ్రహం కూడా హైదరాబాద్ కు వచ్చారని, ఆయనకు టెస్ట్ లుక్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. ప్రియాంక చోప్రాతో జాన్ అబ్రహం కీలక సన్నివేశాల్లో నటించనున్నారని,  వీటిని హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక, మహేష్ బాబు షూటింగ్ ప్రారంభించారు. జాన్ త్వరలో వారితో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఇదిలా ఉండగా SSMB29 మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. 2026 నాటికి ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుండగా, ఈ రెండు సినిమాలు వరుసగా 2027, 2028 ఏడాదిలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ బిజీ 

పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడిగా మెగా ఫోన్ పడుతున్నారు. అయితే జక్కన్న సినిమాలో నటించాలంటే బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో పృథ్వీరాజ్ సినిమాలో నుంచి తప్పుకున్నాడని సమాచారం.

‘ది డిప్లొమాట్’ రిలీజ్ కు రెడీ 

మరోవైపు జాన్ తన చిత్రం ‘ది డిప్లొమాట్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం పాకిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయ అమ్మాయిని బలవంతంగా వివాహం చేసుకువడానికి చేసే ప్రయత్నం అనే స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కుతోంది. కుముద్ మిశ్రా, షరీబ్ హష్మీ, అశ్వత్‌భట్‌లు నటించిన ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదల కానుంది.

కాగా ప్రియాంక నటించిన చివరి బాలీవుడ్ చిత్రం ‘ది వైట్ టైగర్’. ఈ చిత్రం 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. త్వరలో ప్రియాంక చోప్రా ‘సిటాడెల్ సీజన్ 2’లో కనిపించనుంది. అలాగే ఆమె ‘జీ లే జరా’ అనే సినిమాలో నటించాల్సి ఉంది.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×