BigTV English
Advertisement

Gold Helmet: బాలీవుడ్ సినిమా లెవల్‌లో.. 2500 ఏళ్ల నాటి బంగారు హెల్మెట్ చోరీ

Gold Helmet: బాలీవుడ్ సినిమా లెవల్‌లో.. 2500 ఏళ్ల నాటి బంగారు హెల్మెట్ చోరీ

Gold Helmet: నెదర్లాండ్స్‌లో వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌ను దొంగలు చోరీ చేశారు. ఈ హెల్మెట్‌ను ఎట్లాగైనా చేజిక్కించుకోవాలని గట్టిగా డిసైడయ్యారు. ఇందుకోసం పక్కాగా స్కేచ్ వేసి.. ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫైనల్లీ గోల్డెన్ హెల్మెంట్‌తో పరారయ్యారు. సినిమా రేంజ్‌ని తలపించేలా సీన్ టు సీన్.. థ్రిల్లింగ్ గా చోరీ చేసేశారు. అయితే ఇక్కడ మనకో డౌట్ రావొచ్చు. 2500 ఏళ్ల నాటి గోల్డెన్ హెల్మెట్‌కి ఎలాంటి సెక్యూరిటీ లేదనుకుంటే పొరపాటే. అది చాలా పెద్ద మ్యూజియం. భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన వ్యవస్థ.. మ్యూజియం డోర్లతో సహా అంతా ఫుల్ పవర్ ఫుల్. అయినా దొంగలు పడ్డారు.. గోల్డ్ హెల్మెట్ ఎత్తుకెళ్లారు. నెదర్లాండ్స్ లోని ఎక్సెన్ నగరంలో డ్రెంట్స్ పురాతన వస్తు ప్రదర్శనలో ఈ దొంగతనం జరిగింది. 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్ కావడంతో ఈ దొంగతనం సంచలనం క్రియేట్ చేసింది.


ఫస్ట్ మ్యూజియం దగ్గరకి ముసుగులు వేసుకొని దొంగల ముఠా ఎంట్రీ ఇచ్చింది. మ్యూజియం భారీ తలుపును హోల్స్ మెషిన్, ఇనుపరాడ్లతో తెరిచేశారు. అయితే లోపలివైపు మరో పెద్ద తలుపు ఉంటుంది. దీన్ని తెరవడం అంతా ఈజీ అయితే కాదు. దొంగలకు మ్యూజియాన్ని ముందే విజిట్ చేసి ఉండొచ్చు.. లేదా మ్యూజియం గురించి పిన్ టు పిన్ స్టడీ చేసి ఉండొచ్చు. అందుకే వారికి వెంటనే భారీ మెషిన్లతో పాటు బాంబులను తెచ్చుకున్నారు. లోపల ఉన్న మరో భారీ తలుపుకు బాంబు అమర్చి పేల్చిపడేశారు. దీంతో డోర్ ముక్కలు ముక్కలైంది. ఇక తలుపు ఓపెన్ అవ్వడంతో లోపలికెళ్లి మ్యూజియంలోని నాలుగు ముఖ్యమైన వస్తువులను తీసుకొని జంప్ అయ్యారు. అయితే చోరీకి గురైన వాటిల్లో 2500 ఏళ్ల నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉండటంతో ఈ దొంగతనం ఇంత హైలెట్ అయ్యింది.

ఈ హెల్మెట్‌ను క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్‌ను రొమేనియాలో వంద ఏళ్ల కింద ఒక కుగ్రామంలో కనుగొన్నారు. హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీగా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారట. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా ఈ హెల్మెట్ కాపాడుతుందని అప్పటి జనం విశ్వసించేవారని చెబుతున్నారు.


Also Read: ఒకప్పుడు హిందూ పాలనలో ఉన్న ఇండోనేషియా.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా ఎలా మారింది?

ఈ హెల్మెట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. జంతువధ చేస్తున్నట్లు హెల్మెట్ బ్యాక్ సైడ్ చెక్కినట్లు పిక్చర్ చూస్తే తెలుస్తోంది. ఇది తమ సంస్కృతి సంబంధించిదని.. ఇది వెలకట్టలేని అతి ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం తెలిపింది. గోల్డెన్ హెల్మెట్‌తో పాటు డేసియన్ల రాజ్యానికి చెందిన ఆనాటి రాయల్ బ్రేస్‌లెట్ సహా మూడు వస్తువులను చోరీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ చోరీని నెదర్లాండ్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×