BigTV English

DeAr Trailer: గుడ్ నైట్ ఫీమేల్ వెర్షన్ లా ఉందేంటి.. ?

DeAr Trailer: గుడ్ నైట్ ఫీమేల్ వెర్షన్ లా ఉందేంటి.. ?


DeAr Trailer: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఒకపక్క సంగేతేహా దర్శకుడుగా.. ఇంకోపక్క హీరోగా నటిస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం జీవి ప్రకాష్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రెబల్ కాగా.. రెండు డియర్.ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తాజాగా డియర్ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. అందులో భాగంగా నేడు డియర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


హీరో హీరోయిన్ల కుటుంబాలను పరిచయం చేయడంతో ట్రైలర్ మొదలయ్యింది. చెన్నైలో ఒక అందమైన హీరో.. డ్రీమ్ లో సౌండ్ వచ్చినా టక్కున లేచి కూర్చుంటాడు. ఎలాంటి సౌండ్ లేకుండా ఉంటేనే అతనికి నిద్రపడుతుంది. ఇక అదే ఊరిలో ఉండే హీరోయిన్.. ఆమెకు నిద్రలో గురక పెట్టే అలవాటు. ఈ విషయాలను చెప్పకుండా పెద్దలు వీరి పెళ్లి చేసేస్తారు. మొదటిరాత్రిన ఒకరికి ఒకరు దొరికిపోతారు. ముఖ్యంగా హీరోయిన్ గురకక హీరోకు నిద్ర అనేది లేకుండా పోతుంది. దీంతో అతడు పడిన బాధలనే వినోదాత్మకంగా చూపించారు.

అంతేకాకుండా భార్య గురక వలన భర్త ఎదుర్కున్న సమస్యలు ఏంటి.. ? వారి మధ్య గొడవలకు కారణం ఏంటి.. ? చివరికి వీరిద్దరూ కలుస్తారా.. ? అన్నది కథ. ఈ ట్రైలర్ ను చూస్తే .. ఇప్పటికే హిట్ టాక్ అందుకున్న గుడ్ నైట్ సినిమా గుర్తురాక మానదు. అయితే అందులో హీరోకు గురకసమస్య ఉంటే .. ఇందులో హీరోయిన్ కు ఆ సమస్య ఉంటుంది. అంటే..గుడ్ నైట్ ఫీమేల్ వెర్షన్ అన్నమాట. ఏప్రిల్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×