BigTV English

Telangana Weather Report: రానున్న రెండు రోజులు జర భద్రం.. ఐఎండీ కీలక హెచ్చరిక..!

Telangana Weather Report: రానున్న రెండు రోజులు జర భద్రం.. ఐఎండీ కీలక హెచ్చరిక..!
Weather Report
Weather Report

Telangana Weather Alert (weather news today Telangana): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు సూరీడు సుక్కలు సూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే కాలు బయట పెట్టాలంటే జనాలు వణికిపోతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.


రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వేడి గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలోను ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

రెండు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్ర ప్రజలు అస్సలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఉత్తర తెలంగాణలో ఈ వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే తప్ప అస్సలు బయటకు వెళ్లకూడదని, లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని తెలిపింది. కాగా, ఏప్రిల్ 7 తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.


Also Read: Weather News Today : చల్లటి కబురు.. రేపట్నుంచి వర్షాలు.. హైదరాబాద్ లో మాత్రం ?

కాగా, ఈ ఏడాది ఎండలు మార్చి నెల కంటే కాస్త ముందుగానే మొదలైన విషయం తెలిసిందే. 2016 తర్వాత ఈ ఏడాదే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుందట. పిల్లలు, వృద్ధులు ఈ సమయాల్లో అస్సలు బయటకు రాకూడదని తెలిపారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×