BigTV English

Deepika-Ranveer Singh: బ్రేకింగ్.. దీపికా- రణ్వీర్.. కూతురు పేరు చెప్పేశారోచ్

Deepika-Ranveer Singh: బ్రేకింగ్.. దీపికా- రణ్వీర్.. కూతురు పేరు చెప్పేశారోచ్

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. ఈ ఏడాది కల్కి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న  దీపికా.. గత నెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో తాము త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు రణ్వీర్  సింగ్‌, దీపికా పదుకొనే ప్ర‌క‌టించారు. సెప్టెంబర్ 2024 అంటూ త‌మ జీవితంలోకి ఓ చిన్నారి రాబోతున్న విష‌యాన్ని భ‌ర్త‌తో క‌లిసి అభిమానుల‌తో పంచుకున్న‌ది. ఇక ఆమె 7 వ నెల వచ్చేవరకు షూటింగ్ చేస్తూనే ఉంది.


ఇక తల్లిదండ్రులుగా మారడానికి తాము ఎంతగానో ఎదురుచూస్తున్నామని దీపికా- రణ్వీర్ దంపతులు చెప్పుకొచ్చారు. చిన్నారి జననంతో ఆ ఇంట కొత్త వెలుగు పుట్టుకొచ్చింది. అయితే ఇప్పటివరకు చిన్నారి ముఖాన్ని  అభిమానులకు ఈ జంట చూపించలేదు.

స్టార్ సెలబ్రిటీలు కావడం.. అందులోనూ విమర్శలు, వివాదాలు ఉన్న జంట కావడంతో ఆ ప్రభావం పిల్లలపై పడకుండా చిన్నారి ముఖాన్ని చూపించడానికి  దీపికా ఒప్పుకోలేదని, చిన్నారి రెండేళ్లు దాటేవరకు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు అని అనుకున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక తాజాగా పండగపూట.. దీపికా తన కూతురి మొదటి ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది.


అంతేకాకుండా ఈ దీవాళీ రోజున తమ కూతురు పేరును చెప్పుకొచ్చారు. తమ కుమార్తెకు దువా పదుకొనే సింగ్ అని నామకరణం చేసినట్లు దీపికా చెప్పుకొచ్చింది. ఇక దువా అంటే ప్రార్థన అని, తమ ప్రార్థనలకు ప్రతిరూపం ఆమె అని రాసుకొచ్చింది. ఇక ముఖాన్ని చూపించకుండా కేవలం చిన్నారి పాదాలను మాత్రమే చూపించింది.  ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×