BigTV English

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే
Deepika Padukone: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. బాలీవుడ్ లవ్ కపుల్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఆదివారం ఉదయం ఆడబిడ్డకు స్వాగతం పలికారు. దీపికా శనివారం ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలోని H. N. రిలయన్స్ ఆసుపత్రిలో కనిపించింది. ఇవాళ అంటే ఆదివారం ఉదయం హాస్పిటల్‌లో పండంటి ఆడ్డబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.కాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రసవానికి ముందు శుక్రవారం ఆమె భర్త రణ్‌వీర్ సింగ్, వారి కుటుంబ సభ్యులు ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాగా ఫిబ్రవరిలో దీపిక గర్భం దాల్చినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి అభిమానుల్లో ఒకటే ఆసక్తి మొదలైంది. దీంతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తికి ఇవాళ్లితో తెరపడింది.


ఇదిలా ఉంటే ఎన్నో ఎళ్లుగా డేటింగ్‌లో ఉన్న దీపికా అండ్ రణ్ వీర్ 2018లో ఇటలీలోని లేక్ కోమోలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత వారు బెంగళూరు, ముంబైలలో గ్రాండ్ రిసెప్షన్‌లను నిర్వహించారు. అయితే పెళ్లైన తర్వాత వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఎప్పటికప్పుడు దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ విషయం హాట్ టాపిక్‌గా ఉండేది. ఏ విషయంలో ఈ జంట హాస్పిటల్‌కి వెళ్లినా అది దీపికా ప్రెగ్నెన్సీ విషయం అనే వార్తలు చక్కర్లు కొట్టేవి.

Also Read: కల్కి బ్యూటీ దీపికా పదుకొనె బేబీ బంప్ ఫోటోషూట్.. భర్తతో కలిసి..


కానీ దీపికా అనుకోకుండా ఓ రోజు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ప్రెగ్నెన్సీ శుభవార్తను అభిమానులతో షేర్ చేసుకుంది. దానికి ‘సెప్టెంబర్ 2024’ అనే క్యాప్షన్ పెట్టింది. దీంతో అప్పటి నుంచి అభిమానులు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం, ఈ జంట తమ అందమైన ప్రెగ్నెన్సీ షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో దీపిక తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి కనిపించింది.

అయితే అన్ని ఫొటోలలో దీపిక తన బేబీ బంప్‌ని చూపిస్తూ కనిపించింది. దీంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ జంటపై కామెంట్ల వర్షం కురిపించారు. ఇక దీపికా పదుకొనే ఎప్పుడెప్పుడు బిడ్డకు జన్మనిస్తుందా అని ఎదురుచూసే అభిమానులకు ఇవాళ సర్‌ప్రైజ్ అందింది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఇదిలా ఉంటే ఆమె సినిమా విషయానికొస్తే.. దీపికా పదుకొనే చివరిసారిగా కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కనిపించింది. ఇక త్వరలో రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్‌’లో కూడా కనిపించనుంది.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×