BigTV English

Kaantha Movie: పూజా కార్యక్రమాలతో రానా – దుల్కర్‌ సల్మాన్‌ మూవీ.. ఛాన్స్ కొట్టేసిన రవితేజ బ్యూటీ

Kaantha Movie: పూజా కార్యక్రమాలతో రానా – దుల్కర్‌ సల్మాన్‌ మూవీ.. ఛాన్స్ కొట్టేసిన రవితేజ బ్యూటీ

Kaantha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకుల్ని అభిమానులుగా సంపాదించుకున్నాడు. అతడి హీరోయిజం, స్వాగ్, లుక్స్ ఎంతోమందిని అట్రాక్ట్ చేశాయి. అందువల్లనే మలయాళంతో పాటు టాలీవుడ్‌లోనూ ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇక గతంలో ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయన ఈ సినిమా సినీ ప్రియుల్ని అలరించడంలో విఫలం అయింది. బాక్సాఫీసు వద్ద పెద్దగా అలరించలేకపోయింది.


ఆ తర్వాత ఇటీవలే ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో కీలక పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా అందులో ‘కాంత’ ఒకటి. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతోంది. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఇందులో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. గతంలో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో నటించి మంచి హిట్ టాక్ అందుకున్నాడు. అదే సమయంలో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు అతడిపై, ఆ సిరీస్‌లో విమర్శలు చేశారు. ఆ సిరీస్‌ బోల్డ్ సన్నివేశాలతో ఉండటంతో మాటలు కాయాల్సి వచ్చింది. కానీ రానా అవేవి పట్టించుకోకుండా పలు సినిమాలు, సిరీస్‌లలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా మరికొన్ని చిత్రాల్ని సైతం నిర్మిస్తున్నాడు.


Also Read: మత్తు వదిలించిన ట్రైలర్.. మామూలుగా లేదు భయ్యా

ఇక ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాలో నటించేందుకు సిద్ధం అయ్యాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్‌లు అంచనాలు పెంచేశాయి. దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో ఉన్న ఆ పోస్టర్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటూ సోషల్ మీడియాలో టాక్ గట్టిగానే నడుస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీలో హీరోయిన్‌ను మేకర్స్ రివీల్ చేసి అందరికీ ఊహించని సర్‌ప్రైజ్ అందించారు. తాజాగా ఈ ‘కాంత’ సినిమా పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి దుల్కర్ సల్మాన్, రానాతో పాటు ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హాజరై సినీ ప్రియులకు ట్రీట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా భాగ్య శ్రీ అదిరిపోనుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Related News

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Tv Kissik Talk Show : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..

Big Stories

×