Rashmika..ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకుంటూ అందరికీ అందనంత ఎత్తులో ఎదిగిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) రెండేళ్లలో మూడు సినిమాలతో ఏకంగా రూ.3500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.. గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తమన్నా (Tamannaah), సమంత(Samantha), నయనతార(Nayanthara ) త్రిష (Trisha), దీపికా పదుకొనే (Deepika Padukone), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) లాంటి స్టార్ హీరోయిన్లు కూడా రాబట్టలేని కలెక్షన్స్ ను కేవలం రెండేళ్లలోనే రాబట్టి సత్తా చాటింది రష్మిక. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషలలో కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది. అయితే ఇప్పుడు ఈమె స్పీడ్ కి బ్రేకులు వేయడానికి ఏకంగా హాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగిందని చెప్పవచ్చు.
వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న ప్రియాంక చోప్రా..
ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. ఎవరి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె సల్మాన్ ఖాన్ (Salman Khan), షారుక్ ఖాన్(Shahrukh Khan), రణబీర్ కపూర్(Ranbir Kapoor) , షాహిద్ కపూర్(Shahid Kapoor), రణవీర్ సింగ్(Ranvir Singh) వంటి స్టార్ హీరోలతో జతకట్టి, కెరియర్ ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ ని వదిలి హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే అమెరికాకు చెందిన పాపులర్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని, ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నివాసం ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈమెకు గ్లోబల్ స్థాయిలో మార్కెట్ లభించడంతో రాజమౌళి(Rajamouli ) మహేష్ బాబు(Maheshbabu) తో చేస్తున్న SSMB 29 సినిమా కోసం ఈమెను రంగంలోకి దింపారు. అలాగే హిందీలో రాబోతున్న ‘క్రిష్ -4’ లో కూడా ప్రియాంక కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ: Rajamouli: రాజమౌళినే వెయిట్ చేయిస్తున్న సినిమా.. ఏంటబ్బా ఆ సినిమా..?
ప్రియాంక రాక.. రష్మికకు ఆటంకం కలగనుందా..?
అటు ఎస్ఎస్ఎంబి 29 కోసం రూ.30 కోట్లు, ఇటు క్రిష్ -4 కోసం రూ.20 కోట్లు తీసుకుంటోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ సృష్టిస్తుంది. మరొకవైపు వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక స్పీడ్ కి ఈమె బ్రేకులు వెయ్యబోతుందని కూడా కొంతమంది చెబుతున్నారు. ఒకవేళ టాలీవుడ్ , బాలీవుడ్ హీరోలకు ప్రియాంక చోప్రా గనుక ఫస్ట్ ఛాయిస్ అయినట్లయితే రష్మిక వెనుకబడిపోతుంది అనడంలో సందేహం లేదని అటు సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి చూడాలి ప్రియాంక హిందీలో మరెన్ని అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో .. ప్రస్తుతం రష్మిక విషయానికొస్తే ఈమె చేతిలో ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో తో పాటు మరి కొన్ని చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తి చేసి మరో కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేయాలి అంటే ముందు ఈమెకు అవకాశాలు కల్పించాలి. మరి ప్రియాంక చోప్రా రాక రష్మిక మందన్నకు ఎలాంటి ఆటంకాన్ని కలిగిస్తుందో అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రష్మిక కూడా కాస్త అయోమయంలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఇండస్ట్రీలో ఎవరిది పై చేయి అవుతుందో.