భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. దేశ వ్యాప్తంగా సుమారు 13 వేల రైళ్లు ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు రాకపోకలు కొనసాగిస్తాయి. అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లో రన్నింగ్ రైళ్లకు బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో రైల్వే అధికారులు ఏం చేస్తారు? ప్రయాణీకుల ప్రాణాలను కాపాడేందుకు ఏ చర్యలు తీసుకుంటారు? అనేది ఇప్పుడు చూద్దాం..
రైలు బ్రేకులు ఫెయిల్ అయితే ఎలా?
భారత్ లో ప్రస్తుతం రైల్వే భద్రత విషయంలో అధికారులు కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదాలను అరికట్టి, రైల్వే ప్రయాణీకుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కవచ్ లాంటి నూతన టెక్నాలజీతో అసలు రైళ్లు ఒకే ట్రాక్ మీదికి వచ్చి యాక్సిడెంట్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అత్యంత అరుదుగా రైళ్లకు బ్రేకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వే పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ప్రయాణీకులకు అపాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి రైల్వే స్టేషన్ చివర్లో శాండ్ హంబ్ నిర్మిస్తారు.
శాండ్ హంబ్ లోకి రైలు మళ్లింపు
రైలుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయనే సమాచారం రాగానే, సమీప రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మాస్టర్ రైలును శాండ్ హంబ్ లూప్ లైన్ లోకి తీసుకుంటాడు. ఇక్కడ ఫ్రెక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల రైలు ఒక్కసారిగా స్లో అవుతుంది. చివరకు ఆగిపోతుంది. ప్రయాణీకులు అందరూ సేఫ్ అవుతారు. భారత్ లో ప్రస్తుతం బ్రేకులు ఫెయిల్ ఘటనలు చాలా వరకు తగ్గిపోయాయి. అరుదైన సందర్భాల్లో మాత్రమే రైళ్ల బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి. ఒకవేళ రైలు బ్రేకులు ఫెయిల్ అయినా, ఎలాంటి నష్టం కలగకుండా రైల్వే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read Also: రైల్వే టికెట్లలో ఇన్ని రకాల వెయిటింగ్ లిస్టులు ఉంటాయా? మీరు అస్సలు ఊహించి ఉండరు!
భారీగా తగ్గిన రైల్వే ప్రమాదాలు
దేశంలో రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు రైల్వేశాఖ కీలక చర్యలు చేపడుతోంది. 2014తో పోల్చితే 2024 వరకు రైల్వే ప్రమాదాలు గణనీయంగా తగ్గినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వేల డేటా ప్రకారం, 2004-14 కాలంలో జరిగిన రైలు ప్రమాదాలు 1,711. సంవత్సరానికి సగటున 171 ప్రమాదాలు జరిగాయి. ఇది 2014-24 కాలంలో 678కి తగ్గింది. సంవత్సరానికి సగటున 68 ప్రమాదాలు జరిగినట్లు వెల్లడించింది. రైల్వే ప్రమాదాలు తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే భారీగా ఖర్చు చేస్తోంది.
Read Also: ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఇంతకీ అది ఎక్కడుందో తెలుసా?