BigTV English

Spirit Movie Heroine : ప్రభాస్ పక్కన మళ్లీ పాత హీరోయినే… సందీప్ కాస్త కొత్తగా థింక్ చేయొచ్చు కదా…?

Spirit Movie Heroine : ప్రభాస్ పక్కన మళ్లీ పాత హీరోయినే… సందీప్ కాస్త కొత్తగా థింక్ చేయొచ్చు కదా…?

Spirit Movie Heroine : టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే.. గత సంవత్సరం కల్కి2898 ADతో ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సంవత్సరం రాజా సాబ్ తో పలకరించనున్నారు. ఆ తరువాత వరుసగా కల్కి2, సలార్ 2, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉనాయి. ఈ సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా స్పిరిట్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు, ఆమెతో ప్రభాస్ వరుసగా రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పినట్లు వస్తున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం..


ప్రభాస్ పక్కన మళ్ళీ పాత హీరోయిన్..

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబో లో వస్తున్నా చిత్రం స్పిరిట్. యానిమల్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందీప్ రెడ్డి ప్రభాస్ తో సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయని చెప్పచ్చు. ఈ సినిమాపై అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్సయ్యారంటూ వస్తున్నా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ భామ కల్కి మూవీలో ప్రభాస్ తో కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సమాచారం. అంతేకాక ఈ భామ కల్కి 2 లోను నటిస్తున్నట్లు టాక్. వరుసగా ప్రభాస్ తో రెండు సినిమాలలో ఓకే హీరోయిన్ ని ఫిక్స్ చేయడంతో అభిమానులు ప్రభాస్ పక్కన మళ్ళీ పాత హీరోయిన్ ని చూడాలా అంటూ సందీప్ కాస్త కొత్తగా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.


వరుస సినిమాలతో ..ఫుల్ బిజీ ..

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కల్కి సినిమాలో ప్రెగ్నెంట్ గా కనిపించారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొని, ఆమెకు మరిన్ని ఆఫర్స్ రావడానికి కారణమైంది. దీపికా పదుకొనే వరుసగా సినిమాల్లో నటించడం ఆమె అభిమానులలో ఆనందాన్ని రెట్టింపు అవుతుంది. ఇక ప్రభాస్ కల్కి2898AD తో ప్రేక్షకుల ముందుకు వచ్చి 1100 కోట్ల వసూలను సాధించారు. ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను లైన్లో పెట్టారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయింది. ఇంకొన్ని రోజులు ప్రభాస్ షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పూర్తవుతుంది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబర్ లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

Mahesh Babu : ప్రియాంక – మహేష్ పాట.. ప్యాకప్ తో నెలరోజులు రెస్ట్ అంటున్న మహేష్..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×