BigTV English

Mahesh Babu : ప్రియాంక – మహేష్ పాట.. ప్యాకప్ తో నెలరోజులు రెస్ట్ అంటున్న మహేష్..

Mahesh Babu : ప్రియాంక – మహేష్ పాట.. ప్యాకప్ తో నెలరోజులు రెస్ట్ అంటున్న మహేష్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 మూవీ కోసం మహేష్ అభిమానుల కాక ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. రాజమౌళి RRR మూవీ తర్వాత రానున్న సినిమా కావడం, ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు తీస్తుండడంతో అభిమానులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ మూవీపై ఎటువంటి అప్డేట్ వచ్చినా ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి  ప్రియాంక చోప్రా, కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆ వివరాలలోకి వెళితే..


ప్రియాంక – మహేష్ పాట..

దర్శక ధీరుడు రాజమౌళి, ఈ సినిమాలో మహేష్ ను కొత్తగా చూపించనున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మహేష్ ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ ఐన సంగతి తెలిసిందే. హాలీవుడ్ హీరో మాదిరిగా మహేష్ ను పూర్తిగా మార్చేశారు జక్కన్న. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. శంకరపల్లి శివారులలో వేసిన ఓ సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పై ఒక పాటను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఈరోజుతో ఈ షెడ్యూల్ పూర్తవుతుందని.. మరో షెడ్యూల్ వేసవి సెలవుల తర్వాత స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుని, ప్రియాంక చోప్రాతో మరోషెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇక మహేష్ ప్రియాంక పాట తరువాత ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. నెల రోజులపాటు మహేష్ వేసవి సెలవులు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక జూన్, జూలై నెలలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. ఇక సినిమాపై వస్తున్న అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.


నెలరోజులు రెస్ట్..రీ జాయిన్ అప్పుడే ..

ఇక ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఆమె తెలుగు సినిమాలో కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే ప్రియాంక చోప్రా తో దాదాపు షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. రాజమౌళి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో VFX కు, సెట్ డిజైన్ కు భారీగా బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు టాక్. ఇక రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి RRR ను మించి ఈ సినిమా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మహేష్ వెకేషన్ ని కంప్లీట్ చేసుకొని సినిమా సెట్ లో అడుగు పెట్టారు. మూడో షెడ్యూల్ పూర్తిచేసి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మరల షూటింగ్ లో రీ జాయిన్ అవుతారు. ఏది ఏమైనా సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్త. ఇది తెలుసుకున్న అభిమానులు SSMB 29 బ్లాక్ బాస్టర్ అవుతుంది అని, ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Namrata: పండుగాడు ఎప్పటికీ ముసలోడు కాడు.. నిజమేనండోయ్..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×