BigTV English
Advertisement

Financial Rules: మే 1 నుండి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే జేబుకు చిల్లు

Financial Rules: మే 1 నుండి  కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే జేబుకు చిల్లు

Financial Rules: మే నెల ప్రారంభం అయింది. పౌరులుగా మనం ప్రతి నెలా మారే కొన్ని నియమాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మే 1 నుండి మార్చబడుతున్న ఈ నియమాల గురించి మీకు తెలియకపోతే.. మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మే 1 నుండి మారబోయే కొత్త రూల్స్ మీ బ్యాంక్ ఖాతా, ATM లావాదేవీలు , LPG ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మరి మే 1 నుండి మారబోయే నియమాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ATM రూల్స్:
మే 1 నుండి ATM ఉచిత పరిమితి ముగిసిన తర్వాత.. మీరు డబ్బును డ్రా చేసుకోవడానికి అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. మే 1 నుండి పరిమితికి మించి డబ్బులు డ్రా చేస్తే.. అదనంగా రూ.19 ఛార్జ్ చెల్లించాలి. గతంలో ఈ ఛార్జీ రూ.17 మాత్రమే.

మెట్రో నగరాల్లో నెలకు 3 సార్లు , ఇతర ప్రదేశాల్లో 5 సార్లు ఫ్రీగా డబ్బులు ఏటీఎం నుండి డ్రా చేసుకోవచ్చు. కానీ దీని పరిమితి మించిన తర్వాత.. మీరు ATM నుండి డబ్బు తీసుకున్న ప్రతిసారీ చార్జీలు కట్ అవుతాయి.


రైలు టిక్కెట్ల నిబంధనలు:
మే 1 నుండి రైల్వే నిబంధనలు కూడా మార్చారు. ఇప్పుడు మీరు వెయిటింగ్ టికెట్ తీసుకొని జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ టిక్కెట్లు స్లీపర్ , ఏసీ కోచ్‌లలో చెల్లవు. మీరు వెయిటింగ్ టికెట్‌పై ఈ కోచ్‌లలో ప్రయాణిస్తున్నట్లు దొరికితే.. TT మీకు జరిమానా విధిస్తారు.

FD వడ్డీ రేట్లలో తగ్గింపు:
RBI రెపో రేటును 0.25% తగ్గించింది. ఆ తర్వాత బ్యాంకులు FD పై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు మే 1 నుండి అధిక వడ్డీ రేటు FD లను (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) నిలిపివేయాలని నిర్ణయించాయి.

పాల ధరలు పెరిగాయి:
మదర్ డెయిరీ , వెర్కా తర్వాత, అముల్ పాల ధరలు కూడా పెరిగాయి. మే 1, 2025 నుండి దేశవ్యాప్తంగా అముల్ పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. మదర్ డెయిరీ , వెర్కా బ్రాండ్లు కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచాయి. ఇది పప్పు, పన్నీర్, నెయ్యి వంటి ఇతర ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది.

Also Read: భూలోక స్వర్గం పహల్గామ్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

గ్యాస్ ధరలు:
ఎల్‌పిజి గ్యాస్ ధరలను గ్యాస్ సిలిండర్ కంపెనీలు ప్రతి నెలా సవరిస్తాయి. దీని కారణంగా.. మే 1న LPG గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు ఉంటాయి. ప్రస్తుతం సిలిండర్ ధర ₹ 17 తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ₹ 14.50 తగ్గి ₹ 1747 కు, కోల్‌కతాలో ₹ 17 తగ్గి ₹ 1851.50 కు చేరుకుంది. గతంలో ఇది ఢిల్లీలో ₹ 1762 కు , కోల్‌కతాలో ₹ 1868.50 కు లభించేది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ముంబైలో ₹ 14.50 తగ్గి ₹ 1699.00 కు, చెన్నైలో ₹ 1906.50 కు చేరుకుంది.

బ్యాంకులకు 12 సెలవు:
మే నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఆర్‌బిఐ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. రెండవ , నాల్గవ శనివారాలు, ఆదివారాలు కాకుండా, బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి నాడు కూడా బ్యాంకులకు సెలవు. ఇవి కాకుండా.. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ రోజులలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×