BigTV English
Advertisement

Affair Video Song: మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేసే ‘ఎఫైర్’.. బిగ్ టీవీ మ్యూజిక్‌లో రిలీజ్

Affair Video Song: మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేసే ‘ఎఫైర్’.. బిగ్ టీవీ మ్యూజిక్‌లో రిలీజ్

Affair Video Song: ఈరోజుల్లో సినిమా సాంగ్స్‌కు ధీటుగా ఆల్బమ్ సాంగ్స్ ఉంటున్నాయి. అందుకే పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు సైతం ఇలాంటి ఆల్బమ్ సాంగ్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా బిగ్ టీవీ మ్యూజిక్‌లో ‘ఎఫైర్’ అనే కొత్త ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మంచి రొమాంటిక్ నెంబర్‌గా తెరకెక్కిన ఈ సాంగ్.. మే 2న సాయంత్రం 6 గంటలకు బిగ్ టీవీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలయ్యింది. ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, పోడ్కాస్ట్ షోలు అంటూ పలు రకాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న బిగ్ టీవీ.. ఇప్పుడు ఈ సరికొత్త ఆల్బమ్ సాంగ్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోనుంది. గ్రాండ్ విజువల్స్‌తో, మంచి యాక్టింగ్‌తో విడుదలయిన ‘ఎఫైర్’ సాంగ్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


యూత్‌కు నచ్చేలా

ఇప్పటికే బిగ్ టీవీ అనేది కేవలం వార్తా సమాచారాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎంటర్‌టైన్మెంట్ కోసం పలు యూట్యూబ్ ఛానెల్స్‌ను క్రియేట్ చేసింది. ఆ ఛానెల్స్ అన్నీ ఏదో ఒక విధంగా సబ్‌స్క్రైబర్లను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాయి. అందుకే కేవలం మ్యూజిక్ లవర్స్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఒక ఛానెల్ కూడా క్రియేట్ అయ్యింది. అదే ‘బిగ్ టీవీ మ్యూజిక్’. ఈ యూట్యూబ్ ఛానెల్ లాంచ్ అవ్వడంతో పాటు అప్పుడే ఇందులో మొదటి సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. అదే ‘ఎఫైర్’. మ్యూజిక్ లవర్స్‌కు, ముఖ్యంగా యూత్‌కు నచ్చే విధంగా ఈ పాటను తయారు చేశారు మేకర్స్. అందుకే ఇది యూత్‌ను కచ్చితంగా ఇంప్రెస్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


దర్శకుల ప్రశంసలు

క్లౌట్ స్టూడియోస్, 4 సీజన్స్ క్రియేషన్స్ కలిసి ‘ఎఫైర్’ పాటను నిర్మించారు. ఈ పాటను ముందుగా హరీష్ శంకర్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్‌గా చూపించగా వారిని విజువల్స్ చాలా ఆకట్టుకున్నాయని మేకర్స్ చెప్తున్నారు. హరీష్ శంకర్‌తో పాటు డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఈ పాటను చూసి ప్రశంసించారు. పాటలోని విజువల్స్‌ను మాత్రమే కాదు.. ఇందులోని ఎమోషన్‌కు కూడా వారి ఫిదా అయ్యారు. ఇది కేవలం ఆల్బమ్ సాంగ్‌లాగా లేదని, సినిమా లాగా ఉంది అని అన్నారు. ఆ క్రెడిట్ అంతా మేకర్స్.. అమర్‌దీప్ గుట్టులాకే ఇచ్చారు. ఈ దర్శకులు మాత్రమే కాదు.. ఈ ఆల్బమ్ సాంగ్‌ను మరికొందరు నటీనటులకు చూపించగా వారు కూడా దీనిపై ప్రశంసలు కురిపించారు.

Also Read: ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ‘హృదయం లోపల’ నుండి వచ్చిన పాట ఇది

అన్నీ బాగున్నాయి

‘ఎఫైర్’ పాటలో బిందు నూతక్కి, దీపూ గౌడ్, షైలు నటీనటులుగా కనిపించారు. ఈ పాటను బాబీ కొరియోగ్రాఫ్ చేయడంతో పాటు తానే దర్శకత్వం కూడా వహించారు. శరవణ వాసుదేవ్ అందించిన సంగీతం.. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంది. లక్ష్మి స్వీయ స్వరం చాలామంది గుర్తుండిపోతుంది. శ్రీరాగ్ వడ్లగొండ అందించిన లిరిక్స్.. అటు రొమాన్స్‌ను, ఇటు ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాయి. మొత్తానికి మ్యూజిక్ లవర్స్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభించిన బిగ్ టీవీ మ్యూజిక్ ఛానెల్.. మొదటి పాటతోనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×