రివ్యూ : “నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ
స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ : నెట్ ఫ్లిక్స్
దర్శకత్వం : అమిత్ కృష్ణన్
Nayanathara – Beyond The Fairy Tale Review : ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార (Nayanathara) జీవితం ఆధారంగా తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “నయనతార – బియాండ్ ది ఫెయిరీ టేల్” (Nayanathara – Beyond The Fairy Tale). ప్రస్తుతం నయనతార, ధనుష్ మధ్య ఈ డాక్యుమెంటరీ వల్లనే వివాదం నడుస్తోంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా, నయనతార హీరోయిన్ గా, ధనుష్ నిర్మించిన “నానుమ్ రౌడీ ధాన్” అనే సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఈ డాక్యుమెంటరీలో చూపించాలనుకున్నారు. కానీ దానికి నిర్మాత అయిన ధనుష్ అంగీకరించకపోవడంతో, నయనతార సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ రాస్తూ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీలో అసలు ఏముంది ? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు ఈ డాక్యుమెంటరీ లో “నానుమ్ రౌడీ ధాన్” సీన్స్ ను చూపించారా? ధనుష్ అభ్యంతరం తెలిపేంతగా ఇందులో ఏముంది? అసలు ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం…
నయనతార సినిమా ఎంట్రీ…
సెలబ్రిటీలు తమ పెళ్లిని ఇలా ఓటీటీలకు అమ్ముకోవడం అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ట్రెండ్. ముఖ్యంగా సౌత్ లో ఇలాంటి సాహసం చేసిన మొట్టమొదటి హీరోయిన్ నయనతార. కేవలం ఆమె జీవితాన్ని అలా ఫ్లాట్ గా తెరపై పెట్టకుండా, ఒక సినిమా స్టైల్ లో అభిమానుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే నయనతార జీవితాన్ని, అందమైన స్టోరీలా చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఇందులో ముందుగా నయన్ ఫ్యామిలీని, ఆమె చిన్ననాటి విషయాలను చెబుతూ డాక్యుమెంటరీని మొదలుపెట్టారు. అలాగే నయనతారకు అసలు యాడ్ నుంచి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయాన్ని చూపించారు. ఇక ఆ తర్వాత నయనతార కెరియర్ తొలినాళ్ళలో ఎదుర్కొన్న విమర్శలను కూడా ప్రస్తావించారు.
రిలేషన్స్, విమర్శలు…
‘గజినీ’ టైంలో వచ్చిన విమర్శలు, ఇండస్ట్రీలో తనని చేసిన బాడీ షేమింగ్ ప్రస్తావిస్తూ నయనతార ఎమోషనల్ అయింది. అయితే అలాంటి టైం లోనే ‘బిల్లా’ కోసం బికినీ వేసే సాహసం చేసినట్టు చెప్పింది. ఇక ఇండస్ట్రీలో జనాలు చేసిన విమర్శల వల్లే తాను మరింత రాటుదేలానని వివరించింది. అంతేకాకుండా తారల మధ్య కొనసాగే రిలేషన్షిప్స్, వాటిపై వచ్చే వార్తలు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అలాంటి వార్తలు వచ్చినప్పుడు నయనతార పరిస్థితి ఏంటి? అనే విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంతేకాకుండా నయనతార గత రిలేషన్షిప్స్, వాటి వల్ల ఆమె పడ్డ బాధను వివరించారు.
సినిమాలకు దూరం…
ఒకానొక టైంలో సినిమాలు మానేయాలని నయన్ తీసుకున్న డెసిషన్, ఓ పక్క వ్యక్తిగత జీవితం, మరొక పక్క సినిమాలో అవకాశాలు కోల్పోవడం గురించి, అలాగే రీఎంట్రీ గురించి ప్రస్తావించింది నయన్. అంతేకాదు నయనతార గురించి నాగార్జున, రాధిక, అట్లీ తదితర సెలబ్రిటీలతో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పించారు. నయన్ లేడీ సూపర్ స్టార్ గా ఎలా మారింది? ఆమె పేరుతో రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నాయి అనే విషయాలను వివరించారు. ఇలా ఈ డాక్యుమెంటరీ మొదటి అర్థభాగంలో నయనతార కెరియర్ గురించి, సెకండ్ హాఫ్ లో విగ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి, పిల్లలు వంటి విషయాలను ప్రస్తావించారు.
పెళ్ళికి ఎరుపు రంగు చీర ఎందుకు ?
నయనతార గ్లాస్ హౌస్ లోనే పెళ్లి ఎందుకు చేసుకుందని,పెళ్లి రోజున ఆమె ఎరుపు రంగు దుస్తులను ధరించడం వెనక ఉన్న కథ ఏంటని తెలిపారు. ఇక చివరిగా నయన్ – విగ్నేష్ ల పిల్లలను చూపిస్తూ డాక్యుమెంటరీకి ఫుల్ స్టాప్ పెట్టారు.
అయితే నయనతార సినిమా ప్రయాణం, కుటుంబం, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఆమె స్టార్ స్టేటస్, రిలేషన్షిప్, పెళ్లి పిల్లల గురించి చెప్పే ఈ డాక్యుమెంటరీలో మొదటి 37 నిమిషాల వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అంతా డ్రామాలా అన్పిస్తుంది. కావాలని నెట్ ఫ్లిక్స్ కోసం ప్లాన్ చేసి చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎమోషన్స్ లేని పెళ్లి, అందులో కొన్ని డబ్బింగ్ సీన్స్ అయితే దారుణంగా ఉన్నాయి.
మొత్తానికి..
నయనతార నుంచి జనాలు బిర్యానీని ఎక్స్పెక్ట్ చేస్తే, ఆమె పప్పన్నంతో సరిపెట్టిందా ? అనిపిస్తుంది. ఈ డాక్యుమెంటరీ చూస్తే, నయన్ డై హార్డ్ ఫ్యాన్స్ కు తప్పా… మిగతా వాళ్ళకు రుచించదు. 2022 లోనే తెరకెక్కి, పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి, ఇలా వివాదాల మధ్య రిలీజ్ అయిన దీనికోసమా రెండేళ్ళు వెయిట్ చేసింది అన్పించక మానదు. ముఖ్యంగా నయనతార లైఫ్ లో జరిగిన కాంట్రవర్సీలు, ఆమె ఎఫైర్ల విషయంలో ఏం జరిగింది అనేవి ఈ డాక్యుమెంటరీలో డీటైల్డ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే నిరాశ తప్పదు. ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు లేని ఒక సాధారణ డాక్యుమెంటరీ ఇది అంతే,