BigTV English

Pawan Kalyan: కాన్వాయ్ ఆపి.. చిన్నారిని పలకరించిన పవన్.. వీడియో వైరల్

Pawan Kalyan: కాన్వాయ్ ఆపి.. చిన్నారిని పలకరించిన పవన్.. వీడియో వైరల్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి తీరిక లేకుండా విధులను నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజల సమస్యలను వినడం, వాటికీ పరిస్కారం చూపడంతో పవన్ బిజీగా మారుతున్నారు. ఇక వీటితో పాటు.. ప్రజలకు దగ్గరవుతూ వారి అభిమానాన్ని గెలుచుకుంటున్నారు.


నేడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఆయన వస్తున్నారు అని తెలియడంతో ప్రజలు.. తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి దారిపొడవునా నిలబడ్డారు. ఇక వారి సమస్యలను వినడానికి పవన్.. కాన్వాయ్ ఆపి మరీ కారుదిగి వారి వద్దకు వచ్చారు.

గత వారంలో కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న జన సైనికుడు చక్రధర్ కుటుంబ సభ్యులు.. పవన్ ను కలిసి.. తమ కొడుకుకు న్యాయం చేయాలనీ కోరారు. ఇక వారి సమస్య తెలుసుకున్న పవన్ కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాన్వాయ్ లో ఉప్పాడ వెళ్తున్న పవన్ కు.. రోడ్డు పక్కన ఒక చిన్నారి.. జనసేన జెండా పట్టుకొని ఊపుతూ కనిపించాడు.


పవన్ ను చూడాలని చెప్తూ.. ఆ జెండాను ఊపుతున్న చిన్నారి వద్ద కాన్వాయ్ ను ఆపి.. ఆ బాలుడును పలకరించారు. బాలుడుకు ప్రేమగా షేక్ హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కబోతుండగా.. సెక్యూరిటీ ఆ పిల్లవాడిని పట్టుకోగా.. వారిని అడ్డుకొని.. అక్కడకు వచ్చినవారితో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు నాయకుల వద్దకు ప్రజలు వెళ్లడం చూసాం.. కానీ, మొదటిసారి ప్రజల వద్దకే నాయకుడు రావడం ఇదే చూస్తున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×